ధృతరాష్ట్ర కౌగిలికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు: పొత్తులపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!!
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ పాలనను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో కొనసాగుతున్న పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని, పొత్తులపై తెలంగాణాలో జరుగుతున్న చర్చను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండాలా వద్దా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని జానారెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు తర్వాత నుండి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి తాజాగా పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను టీపీసీసీ చీఫ్ గా ఉన్నంతకాలం బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చేతులు కలపబోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధృతరాష్ట్ర కౌగిలికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని ఆయన పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణ ఓటమి పాలవుతుందని 25 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. బిజెపి, ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
🔥కేసీఆర్ పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నాపత్రం లీకులు...
— Revanth Reddy (@revanth_anumula) April 4, 2023
🔥పదవ తరగతి మొదలు- టీఎస్పీఎస్సీ వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలాయి..
🔥లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాడు...
🔥కేసీఆర్ కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు..
🔥ఇక… pic.twitter.com/KMZBIsRpal
ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు వెలుగులోకి వస్తుండడంతో ప్రశ్న పత్రాల లీకేజీలపై కెసిఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కెసిఆర్ పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతోనే ప్రశ్నాపత్రాలు లీకలవుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదవ తరగతి మొదలు టీఎస్పీఎస్సీ వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలాయన్నారు రేవంత్ రెడ్డి. లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని, కెసిఆర్ కు ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. ఇక పరీక్షలు కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేసి నిప్పులు చెరిగారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications