నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లోకి వచ్చే ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు!

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్న ప్రైవేటు బస్సులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్న ప్రైవేటు బస్సులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రాత్రి 10 గంటలలోపు నగర రోడ్లపైకి రావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 325 కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులతో ట్రాఫిక్ సమస్య

హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులతో ట్రాఫిక్ సమస్య


కాగా, రద్దీ సమయంలో ప్రైవేట్ బస్సులు నగరం లోపలికి రావద్దనే నిబంధనలు ఉన్నాయి. కానీ, గత కొన్ని రోజులుగా రాత్రి 10 గంటలలోపే ప్రైవేట్ బస్సులు నగరంలోకి వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీన్ని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ప్రైవేట్ బస్సులకు చెక్ పెడుతున్నారు.

ప్రైవేట్ బస్సులకు హైదరాబాద్ రోడ్లపైనే అడ్డాలు

ప్రైవేట్ బస్సులకు హైదరాబాద్ రోడ్లపైనే అడ్డాలు

హైదరాబాద్ మహా నగరానికి తెలంగాణలోని జిల్లాలతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి ప్రతినిత్యం 200కుపైగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, సికింద్రాబాద్, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు అడ్డాలున్నాయి. ప్రధాన రోడ్లలోనే వీటి అడ్డాలు ఉండటంతో రాత్రి 10 గంటల వరకు నగరంలో సాధారణ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.

10లోపు హైదరాబాద్‌లోకి ప్రైవేట్ బస్సులు ప్రవేశిస్తే కఠిన చర్యలు

10లోపు హైదరాబాద్‌లోకి ప్రైవేట్ బస్సులు ప్రవేశిస్తే కఠిన చర్యలు

ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రాత్రి 10 గంటల తర్వాతనే ఈ బస్సులకు అనుమతి ఉంటుంది. కానీ, గత కొంత కాలంగా రాత్రి 10 గంటలలోపే నగర రోడ్లపైకి ప్రైవేట్ బస్సులు వస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో ప్రైవేట్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వస్తున్నాయనే విషయాన్ని గుర్తించి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించామన్నారు. ప్రైవేట్ బస్సులతోపాటు భారీ వాహనాలు నిర్ణయించిన సమయంలోనే నగరంలోకి రావాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+