బతుకమ్మ వేళ విషాదం: బతుకమ్మ ఏర్పాట్లు చేస్తూ చెరువులో గల్లంతు; ముగ్గురు మృతి!
మహిళలందరూ ఎంతో ఇష్టంగా సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేళ ఊహించని విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ తొలినాడు ఎంగిలిపూల బతుకమ్మ రోజే, బతుకమ్మ ఏర్పాట్లు చేస్తూ పారిశుధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో విషాదంగా మిగిలింది.
బతుకమ్మ పండుగ కోసం ఏర్పాట్లు చేస్తుండగా చెరువులో ముగ్గురు పారిశుధ్య కార్మికులు గల్లంతైన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటు చేసుకుంది. బతుకమ్మ పండగ సంబరాల్లో భాగంగా తీగుల్ గ్రామంలోని పటేల్ చెరువు కట్ట వద్ద గల బతుకమ్మలను వేసే ఘాట్ వద్ద పిచ్చి చెట్లు మొలవడంతో చెట్లను తొలగిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు అయిన బాబు (25) , గిరిపల్లి భారతి (40), ఏళ్లం యాదమ్మ(43)లు బతుకమ్మ ఘాట్ వద్ద గల మెట్ల పై నుండి జారి చెరువులో పడి గల్లంతయ్యారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రావు సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా చెరువు వద్దకు చేరుకోవడంతో గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. గల్లంతైన ముగ్గురు మరణించినట్లుగా సమాచారం. గల్లంతైన వారిని గజ ఈతగాళ్ల తో గాలించగా బాబు, భారతి మృతదేహాలు బయటకు తీశారు. ఇంకా యాదమ్మ కోసం గాలిస్తున్నారు. మహిళలు సంతోషంగా బతుకమ్మ సంబరాలు జరుపుకునే చోట ముగ్గురి మృతితో విషాదం అలముకుంది.
తీగుల్ గ్రామం లో బతుకమ్మ పండగ సందర్బంగా చెరువు వద్ద పారిశుధ్య పనుల నిమిత్తం వెళ్లిన సమయం లో దురదృష్టవశాత్తు కాలు జారీ చెరువులో పడి ముగ్గురు గ్రామ పంచాయితీ సిబ్బంది మృతి చెందిన ఘటన పై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల మృతి బాధాకరమన్నారు.
దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటన పై విచారం వ్యక్తం చేస్తూ పారిశుధ్య కార్మికుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు అన్ని విధాల అండగ ఉంటామని, ప్రభుత్వం తరపున వారిని అందుకుంటామని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications