ఆ వీడియోలతో ఎమ్మెల్సీ కవితపై, కేసీఆర్ కుటుంబంపై దారుణమైన ట్రోలింగ్స్!!
ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటుంది. కవిత అరెస్టు అక్రమమని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేస్తే, కవితను అరెస్ట్ చేసి మంచి పని చేశారని, కవిత మాత్రమే కాదు హైదరాబాద్ ల్యాండ్స్ కుంభకోణంలో కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావులు కూడా జైలుకు వెళతారని ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రస్తుతం రిమాండ్ లో ఉండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో జర్నలిస్టు ప్రేమ కవితను ఒకవేళ మీకు సీఎంగా అవకాశం వస్తే మీరేం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఒకవేళ నిజంగా తనకు సీఎంగా అవకాశం వస్తే తను ఆల్కహాల్ లేకుండా చేస్తానని చెప్పారు కవిత. ఆల్కహాల్ లేకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుందని చెబుతారని, అయినప్పటికీ తాను మాత్రం అదే నిర్ణయం తీసుకుంటానని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత, లిక్కర్ లేకుండా చేస్తానని చెప్పడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నిజంగా ముఖ్యమంత్రి అయితే అక్క విజన్ నెక్స్ట్ లెవెల్.. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అక్క అంటూ కవితను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇదే సమయంలో కవిత, కేటీఆర్, కెసిఆర్ ఏడుస్తున్నట్టు వీడియోలను సృష్టించి తెలంగాణ యాసలో సాగే కొన్ని పాటలతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
తవ్వకాల్లో బయటపడ్డ ఒక అద్భుతం😂
— Sai Nagarjuna (@_sainagarjuna_) March 16, 2024
Watch till the end 😝#KavithaArrest pic.twitter.com/2nQx9JL7YM
ఏది ఏమైనా ఎప్పుడో కవితను అరెస్టు చేస్తారని భావిస్తే, అదును చూసి పార్లమెంటు ఎన్నికలకు ముందు కవితను అరెస్టు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ కొట్టారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో కెసిఆర్ కుటుంబం మాట్లాడిందని, ఇప్పుడు ఫలితం వారే అనుభవిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తే కవిత అరెస్టు వ్యవహారంపై జరుగుతున్న ట్రోలింగ్ ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ కు ఇబ్బందిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications