ఏపీ ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి జోస్యం..!!

ఏపీలో ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. మూడోసారి మోదీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవన్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 17 స్థానాలకుగానూ 14 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో కాంగ్రెస్
ఏపీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి తన అన్న జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సారి అసెంబ్లీలో పార్టీ అడుగు పెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. కడప నుంచి ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్, జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత..తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీలో కాంగ్రెస్ విజయం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

TS Minister Komatireddy Predicts Congress winning seatin AP Assembly Elections

14 స్థానాలు గెలుస్తాం
సొంత పార్టీ గురించి కోమటిరెడ్డి నెగిటివ్‌గా మాట్లాడారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు ఖంగుతిన్నారు. రాజ్యాంగాన్ని మార్చి వాళ్లే పాలకులుగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 కోట్ల మంది ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని ఎలా అంటారని బీజేపీకి కౌంటర్ వేశారు. వాళ్లంతా రోడ్ల మీదకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసిపోయిందని.. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 17 స్థానాలకుగానూ 14 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

షర్మిల కు కోమటిరెడ్డి షాక్
తమ పార్టీ లక్ష్యం 15 స్థానాల్లో విజయం సాధించడమని, అయితే 14 స్థానాల్లో గెలుస్తామన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్, షర్మిలతో మంచి రిలేషన్ షిప్ ఉంది. సమయం దొరికినప్పడు వారిని కలుస్తూ ఉంటారు. ఇద్దరితో మంచి ఫ్రెండ్ షిఫ్ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+