8, 10 వ తరగతి విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త...
ఎనిమిది, పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. హైదరాబాద్, వరంగల్‌లోని విద్యార్ధులకు ఇదొక సువర్ణవకాశమనే చెప్పుకోవాలి. TGSRTC ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆ సంస్థ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు వచ్చేనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను https://iti.telangana.gov.in సంప్రదించండి. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగనున్నాయి.
ఇక, ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను TGSRTC సంస్థ ఏర్పాటు చేసింది.

నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తోందన్నారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి నోటిఫికేషన్ కోసం https://iti.telangana.gov.in ఈ వెబ్‌సైట్‌నూ సంప్రదించొచ్చు. కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications