rain alert: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్: కాస్త ఎడతెరిపినిచ్చిన వానలు మరోసారి తెలంగాణ వ్యాప్తంగా కురవనున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ ఇతర జిల్లాల్లోనూ రేపట్నుంచి మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో మరో ఆవర్తనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

TS weather: next three days rain in Hyderabad and Telangana districts.

కాగా, రెండు మూడు రోజుల క్రితం వరకు కూడా హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు అక్కడి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఆంధ్రప్రదేశ్ సముద్ర దీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాగల రెండు మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+