తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా: మళ్లీ ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జగరాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇటీర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేయడంతో వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరోసారి ఈ పరీక్ష వాయిదా పడింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితోపాటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం, వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్ ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో మరోసారి వాయిదా వేశారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం గ్రూప్-2 పరీక్ష నిర్వహణ విషయంపైనా స్పందించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. రెండు మూడు రోజుల్లో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత సరైన విధానంలో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుందన్నారు. ఆ తర్వాత వెంటనే పరీక్షలు, నియామక ప్రక్రియ మొదలవుతుందని సీఎం రేవంత్ చెప్పారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications