టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్- వివరాలు ఇవే

TSPSC Group-1 General Ranking List: శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు ఇచ్చింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ కొద్దిసేపటి కిందటే విడుదల అయింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ జాబితాను తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

మొత్తం 41 మంది అభ్యర్థులతో కూడిన జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇది. 550 నుంచి 503 వరకు మార్కులు సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్ల వారీగా ఇందులో ర్యాంకులను కేటాయించింది. ర్యాంక్, హాల్ టికెట్ నంబర్, 900కు సాధించిన మార్కులు, కమ్యూనిటీ, మల్టీ జోన్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా వంటి వివరాలను ఇందులో పొందుపరిచింది.

TSPSC released General Ranking List of Group-1

240946218 అనే హాల్ టికెట్ నంబర్‌కు టాప్ ర్యాంక్ లభించింది. మొత్తం 550 మార్కులొచ్చాయి. ఓపెన్ కేటగిరీకి చెందిన యువతి. మల్టీ జోన్ 2లో ఈ ర్యాంక్ వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ జనరల్ ర్యాంకుల లిస్ట్‌లో ఈ ఓపెన్ కేటగిరీకి మొత్తం 17 ర్యాంకులు లబించాయి. బీసీ- ఏ 2, బీసీ- బీ 14, బీసీ- సీ 0, బీసీ- డీ 6 ర్యాంకులు ఉన్నాయి.

ఈ ఏడాది మార్చి 10వ తేదీన టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నియామక పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన మెయిన్స్ పరీక్షను రాసిన అభ్యర్థుల ప్రాథమిక మార్కులను ఇదివరకే విడుదల అయ్యాయి.

డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ- 2, వాణిజ్య పన్నులు, ప్రాంతీయ రవాణ, జిల్లా పంచాయతీ, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రిసన్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్- 2 వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి.

జిల్లా సాంఘిక సంక్షేమం/ జిల్లా షెడ్యూల్డ్ కుల అభివృద్ధి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌ పోస్టులతో పాటు జిల్లా గిరిజన సంక్షేమం, జిల్లా ఎంప్లాయ్‌మెంట్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్.. వంటి పోస్టులకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+