ఖమ్మం పాలిటిక్స్ లో తుమ్మల వర్సెస్ భట్టి

Subscribe to Oneindia Telugu

ఖమ్మం : తుమ్మల వర్సెస్ భట్టి విక్రమార్క రాజకీయాలతో ఖమ్మం పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అభివృద్ది పనులకు సంబంధించిన శిలఫలకాలకు గులాబీ రంగును వేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వ్యతిరేకిస్తుండడంతో, పనుల శంకుస్థాపన సందర్భంగా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా జిల్లాలోని బనిగండ్లపాడు నుంచి బంజార వరకు రూ.4.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత భట్టి శిలాఫకాలకు గులాబీ రంగు వేయడం పట్ల అభ్యంతరం తెలుపుతూ మంత్రి తుమ్మలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యలో కల్పించుకుని ఇద్దరి మధ్య గొడవను సర్దమణిగించినట్టుగా సమాచారం.

Tummala VS Bhatti in Khammam politics

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In an Inaguaration the arguement was taken place in between Minister Tummala Nageswararao and Congress MLA Bhatti Vikramarka

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి