నాగోల్‌లో అగ్నిప్రమాదం: కాలిబూడిదైన హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం
హైదరాబాద్: నగర శివారులోని నాగోల్‌లోని ఓ ఏటీఎం సెంటర్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఏటీఎం సెంటర్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం మిషన్ కాలిబూడిదైంది.
ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం నుంచి పక్కనే ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో మంటలు ఆర్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications