ప్రేమ పేరుతో నమ్మించి.. శారీరకంగా దగ్గరయ్యాక షాక్ ఇచ్చిన టెక్కీ!..
పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ పురోహిత్ ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి విషయం మాట్లాడితే మాత్రం తిరస్కరిస్తూ వచ్చాడు.
హైదరాబాద్: మహిళలను లైంగికంగా వేధించిన రెండు వేర్వేరు ఘటనల్లో కేపీహెచ్‌బి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను లోబర్చకుని ఆ తర్వాత ముఖం చాటేసినట్లుగా వీరిపై అభియోగాలు ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. తణుకుకు చెందిన ఎన్.శ్రీనివాస్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గచ్చిబౌలిలో పనిచేస్తున్నాడు. ఇక్కడే పరిచయమైన తన సహోద్యోగితో అతను కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకుంటానని శ్రీనివాస్ యువతిని నమ్మించడంతో.. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. తీరా పెళ్లి మాటేత్తసరికి యువతికి వేధింపులు మొదలయ్యాయి. పైగా ఆమెపై దాడి చేయడం కూడా మొదలుపెట్టాడు.

ఇక మరో కేసులో రాజస్థాన్ కు చెందిన రాజ్ పురోహిత్ అనే వ్యక్తి నగరంలోని ఓ క్లాత్ స్టోర్ లో పనిచేస్తున్నాడు. ఇతనికి 24ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ పురోహిత్ ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి విషయం మాట్లాడితే మాత్రం తిరస్కరిస్తూ వచ్చాడు. పైగా తనతో సంబంధాన్ని కొనసాగించాలని వేధించడం మొదలుపెట్టాడు.
ఈ రెండు కేసుల్లో బాధితులు కేపీహెచ్‌బి లోని పోలీసులను ఆశ్రయించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీసీ సెక్షన్-376(రేప్), 420(చీటింగ్) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications