Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో అతివేగంతో బైక్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి (వీడియో)

అతివేగంగా బైక్ నడిపి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండకు చెందిన ఆకాన్ష్, రఘుబాబు అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్ వెళ్తుండగా.. మాదాపూర్ 100 ఫీట్ రోడ్‌లోని పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Two software employees killed in speeding bike accident in Hyderabad

ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చందారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Two software employees killed in speeding bike accident in Hyderabad

గంజాయి విక్రయిస్తూ టెక్కీ అరెస్ట్

గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలోని వసంత్ నగర్ బస్టాప్‌లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గంజాయి విక్రయిస్తుండగా ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి తరచూ అక్కడ్నుంచి గంజాయిని తీసుకువచ్చి రమేష్ బాబుకి ఇచ్చి అమ్మకాలు జరిపిస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం కూడా ఖమ్మం నుంచి తీసుకువచ్చిన గంజాయిని రమేష్ బాబుకు ఇస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే, సంతోష్ మాత్రం గంజాయి ఇచ్చి దొరక్కుండా పారిపోయాడు. రమేశ్ బాబును పోలీసులు అరెస్ట్ చేసి గంజాయితోపాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+