పాపం పసివాడు.. హైవేపై తండ్రి మృతదేహం పక్కన రోదిస్తూ.. హృదయ విదారక ఘటన!!
అన్నెం పున్నెం తెలియని పసిప్రాయంలో తండ్రితో కలిసి బైక్ పైన పాల ప్యాకెట్ కోసం వెళ్ళాడు ఆ పిల్లవాడు. రెండేళ్ల ప్రాయంలో నాన్నతో కలిసి బయటకు వెళుతున్నాం అంటే పిల్లలకు ఉండే సంతోషం సరదా అంతా ఇంతా కాదు. అట్లాంటి సంతోషం క్షణాలలో ఆవిరైంది. రోడ్డు ప్రమాదంలో కళ్ళముందే కన్న తండ్రి కడతేరిపోయిన ఘటన చోటు చేసుకుంది.
రెండేళ్ళ పసివాడి జీవితంలో హృదయ విదారక క్షణాలు
నాన్న లే.. నాన్న లే అని పిలిచినా కదలకుండా విగతజీవిగా పడి ఉన్న తండ్రి తీరు ఆ పసివాడి హృదయాన్ని ముక్కలు చేసింది.
ఎక్కడ ఉన్నాడో తెలియదు? ఏం జరిగిందో అంతకంటే తెలీదు? నాన్న ఎందుకు లేవడం లేదో అసలే తెలీదు? అమ్మ ఎక్కడుందో.. ఇంటికి ఎలా వెళ్లాలో, ఎవరికి చెప్పాలో తెలియదు. సరిగ్గా ఆ క్షణాలు ఆ పసివాడి జీవితంలో హృదయ విదారక క్షణాలు..

విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. పసివాడికి పెద్ద కష్టం
ఏమీ అర్థం కాని అభం శుభం తెలియని పసిప్రాయంలో విజయవాడ జాతీయ రహదారిపై తండ్రి మృతదేహం పక్కనే రెండేళ్ల బాబు ఏడ్చుకుంటూ కూర్చున్న ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ఇనాంగూడ వద్ద బైక్ ని డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో పాల ప్యాకెట్ కోసం బైక్ పై వెళుతున్న తండ్రి సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, రెండేళ్ల బాబు గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
తండ్రి శవం పక్కనే రోదిస్తున్న రెండేళ్ళ బాబు.. హృదయాలను కలచివేసిన ఘటన
ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో తండ్రి మృతదేహం పక్క రోడ్డుపై రోదిస్తూ కూర్చున్నాడు. ఇక స్థానికులు రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత పసివాడి ఏడుపులు విని అక్కడకు చేరుకొని, తండ్రి మృతి చెందినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి మృతదేహం పక్కనే పసివాడు రోదిస్తూ బాలుడు కూర్చున్న దృశ్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది.
డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్లే పిల్లలు అనాధలుగా
చూసిన ప్రతి ఒక్కరికి హృదయ విదారకంగా అనిపించింది. ఈ దృశ్యాన్ని చూస్తే డ్రైవింగ్ చేసే వాళ్ళ నిర్లక్ష్యం ఎందరు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తుందో అన్న ఆవేదన కలుగుతుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, గాయాల పాలైన బాబును ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications