హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణంలో తెలంగాణా అనూహ్య నిర్ణయం!

భారతీయ రైల్వే దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో హై స్పీడ్ రైలు సేవలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్లాన్ చేసిన రైల్వే హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై నగరాలకు హై స్పీడ్ రైలు నడపాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే.

హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ మార్గంలో మార్పులు
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు మార్గంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన దక్షిణ మధ్య రైల్వే అధికారులతో జరిగిన సమావేశంలో హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ మార్గంలో మార్పులు ఉంటాయని రైల్వే అధికారులకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Unexpected changes in the construction of Hyderabad-Chennai and Hyderabad-Bengaluru high-speed rail corridors

హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు కారిడార్ విషయంలో సూచనలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం ప్రకారం ఈ హై స్పీడ్ రైలు కారిడార్ ను ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి వచ్చే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ మార్గం పక్కగా నిర్మించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇక హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు కారిడార్ విషయంలో కూడా కొన్ని కీలక సూచనలు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సుమారు 3.30 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఒక అంచనా. శంషాబాద్ నార్కెట్ పల్లి, సూర్యాపేటల మీదుగా ఖమ్మం నుండి అమరావతిని కలుపుతూ చెన్నైకి వెళ్లే మార్గాన్ని ప్రతిపాదించింది.

ఆమోదం వస్తే సర్వే పనులు
తెలంగాణ ప్రభుత్వం దీనిని శంషాబాద్ నుండి మిర్యాలగూడ వైపుగా హైదరాబాద్ నుండి అమరావతికి నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే మార్గం పక్కగా నిర్మించాలని సూచనలు చేస్తుంది. రైల్వే జీఎం ఆమోదం పొందిన తర్వాత ఈ మార్గంలో సర్వే పనులు ప్రారంభిస్తారు. హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు విషయంలో కూడా రైల్వే శాఖ మొదట హైదరాబాద్లోని శంషాబాద్ నుండి కర్నూలు గుత్తి మీదుగా బెంగళూరు వెళ్లే మార్గాన్ని సూచించింది.

శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్ మీదుగా బెంగుళూరు హైస్పీడ్ రైలు కారిడార్
ఇది తెలంగాణలో మహబూబ్ నగర్, వనపర్తి రోడ్డు మీదుగా ఏపీలోని కర్నూలు ద్వారా బెంగళూరుకు చేరుకుంటుంది. అయితే దీని విషయంలో కూడా దీనికి ప్రత్యామ్నాయంగా దగ్గర మార్గాన్ని సూచించిన తెలంగాణ జాతీయ రహదారికి శ్రీశైలం వద్ద ఎలివేటెడ్ కారిడార్ వస్తున్న కారణంగా హై స్పీడ్ రైలు కారిడార్ ను కూడా శ్రీశైలం మీదుగా చేపట్టాలని సూచించింది.

హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులలో ఏం జరుగుతుందో
రైల్వే శాఖ ఈ నిర్మాణం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని ప్రభుత్వానికి తెలిపింది. అయితే దీని విషయంలో ప్రభుత్వం, రైల్వే శాఖల మధ్య భవిష్యత్ లో ఏం చర్చలు జరుగుతాయో తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ రెండు హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టుల పైన తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+