హైదరాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ప్రత్యేక అతిథి, నిర్ణయం వెనుక..!!

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ.. పోలీసు అధికారులు ప్రత్యేక సిబ్బందిని మొహరించారు. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసారు. రూ. 30 కోట్లతో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో 74 పాండ్స్ తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసారు. వీటిలో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్.. 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి. కాగా, ఈ నిమజ్జన శోభాయాత్రకు ఈ సారి ప్రత్యేక అతిథిగా అమిత్ షా హాజరు కానున్నారు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భాగ్యనగరంలో ఈ నెల 6న గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి ఈ యాత్రలో పాల్గొనేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. మారుతున్న సమీకరణాల వేళ ఈ సారి హైదరాబాద్ లో జరిగే శోభాయాత్రకు ప్రత్యేకత కనిపిస్తోంది.

Union Home Minister amith Shah likely to participate in Hyderabad Ganesh immersion

ఈ సమయంలోనే అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో అమిత్ షా దిగనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి 12.30 వరకు ITC కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు.

కాగా, మధ్యాహ్నం 3.30కి ఎంజే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. చార్మినార్ దగ్గర కూడా అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి.

నగరంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు పైన పోలీసులు స్పష్టత ఇచ్చారు. మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నారు. నిమజ్జనం రోజున అన్ని ప్రభుత్వ .. ప్రయివేటు సంస్థలకు సెలవు ప్రకటించనున్నారు. అయితే, ఈ సారి నిమజ్జనోత్సవానికి అతిథిగా అమిత్ షా హాజరు కానుండటం ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+