సోషల్ మీడియాలో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. రూ. 70 లక్షలు కాజేసింది.. చివరకు
ఇటీవలికాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో గంటలుగంటలు సమయాన్ని గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలోనే ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకూ అన్నీ నేర్చుకుంటున్నారు. స్టడీ, సైన్స్, చరిత్ర, సంస్కృతి ఇలా ప్రతి విషయానికి సంబంధించిన అంశాల్ని నేటి తరం యువతీ యువకులు సామాజిక మాధ్యమాల ద్వారానే నేర్చుకుంటున్నారు.
అయితే సోషల్ మీడియా ఎంత అవసరమో.. అంత ప్రమాదమూ అని ఇటీవలి కాలంలో పలు సంఘటనలు చూస్తే అర్థం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఉప్పల్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి, నగదుతో పాటు చోరీ చేసిన నగదుతో కొనుగోలు చేసిన ఒక ఐఫోన్ 17ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పాగా జయ అని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకూ నిందితురాలు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
అలాగే పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విలాసవంతమైన జీవితానిక అలవాటు పడిన నిందితురాలు జయ భర్తకు తెలియకుండా ఆన్ లైన్ వేదికగా తాళాలు ఎలా పగలగొట్టాలో నేర్చుకుంది. ఇక దొంగతనం చేసే సమయంలో తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు నల్లటి బుర్ఖా, గ్లౌజులు ధరించేది. అంతేకాక ఆన్ లైన్ లో నేర్చుకున్న విధానం బట్టి పోలీసులకు ఆధారాలు దొరకుండా ఉండేందుకు చేతులకు గ్లౌజ్ లు కూడా వేసుకునేదని విచారణలో వెల్లడైంది.

అయితే కొద్దిరోజుల క్రితం ఉప్పల్ పరిధిలోని ఓ ఇంటిలో చోరీకి పాల్పడుతూ సీసీ కెమెరాకు చిక్కింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, కిలొన్నర వెండి, కొంత నగదుతో పాటు ఐఫోన్ 17న కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన వస్తువుల మొత్తం విలువ రూ. 70 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications
