• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంచు లక్ష్మిని వదలని వర్మ .. పాట రిలీజ్ చేసి తనకు కరోనా పాజిటివ్ అని వర్మ ఏప్రిల్ ఫూల్ జోక్

|

కరోనా పై ప్రపంచం అంతా పోరాటం చేస్తుంటే వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో కరోనాపై పోస్ట్ లు పెట్టి రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న సంగీత దర్శకుడు కోటి, కరోనా వైరస్ పై చేసిన, చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ తదితరులు నటించిన పాటను ఆయన రీ ట్వీట్ చేస్తూ తనదైన సెటైర్లు వేసి ఈ మల్టీ స్టార్ సాంగ్ అద్భుతం, మైండ్ బ్లోయింగ్. కరోనా వైరస్ కూడా ఈ పాటను ఇష్టపడుతుంది. నేను నా కరోనా స్పెషల్ సాంగ్ ను ఏప్రిల్ ఫూల్ డే రోజున విడుదల చేస్తున్నాను. ఇక ఎవరు ఫూల్ అవుతారో వైరస్ డిసైడ్ చేస్తుంది అని చెప్పిన వర్మ అన్నంత పని చేశారు . పాట రిలీజ్ చెయ్యటమే కాదు ఊహించని షాకింగ్ ట్వీట్స్ చేశారు .

కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్.. చైనా టార్గెట్ గా నెటిజన్ల ఫైర్ ... వర్మ ట్వీట్ వైరల్కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్.. చైనా టార్గెట్ గా నెటిజన్ల ఫైర్ ... వర్మ ట్వీట్ వైరల్

నెటిజన్ల సహనాన్ని పరీక్షిస్తున్న వర్మ

నెటిజన్ల సహనాన్ని పరీక్షిస్తున్న వర్మ

క‌రోనాపై ‘కనిపించని పురుగు' అంటూ నాన్ సింక్ లో త‌నే రాసి పాడిన ఓ పాట రిలీజ్ చేశాడు వర్మ . తన చర్యలతో నెటిజ‌న్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. ఇక అంతటితో ఆగక తనకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు చెప్పారని పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే మా డాక్టర్ నన్ను టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ నిర్ధారించారు' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో చాలా మంది టెన్షన్ పడినా మళ్ళీ వర్మ కదా .. ఇలాంటివి కామన్ అని లైట్ తీసుకున్నారు . అయితే నెటిజన్లు ఊహించినట్టుగానే వర్మ మళ్ళీ పెట్టిన పోస్ట్ లో ఇప్పుడే ఆ డాక్టర్ ఇది ఏప్రిల్ పూల్ జోక్ అని చెప్పాడు.. అది అతని తప్పు నాది కాదు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

కరోనాపై వర్మ పోస్టులపై మండిపడుతున్న నెటిజన్లు

కరోనాపై వర్మ పోస్టులపై మండిపడుతున్న నెటిజన్లు

ప్రపంచం కరోనా భయంతో ఉన్న వేళ వర్మకు జోక్స్ వెయ్యటానికి కరోనా ను మించి మంచి టాపిక్ దొరకలేదు . అసలు లిక్కర్ దొరకని వేళ కదా ...వర్మ ఇలా పిచ్చి గా ప్రవర్తించటం సహజమే అని కొందరు అంటుంటే ,వొడ్కా దొరక్క వ‌ర్మ మాన‌సిక ప‌రిస్థితి కూడా క్షీణించింద‌ని ఎర్ర‌గడ్డ‌కు త‌ర‌లించాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక అంతే కాదు నిన్నటికి నిన్న మంచు లక్ష్మీని టార్గెట్ చేసిన వర్మ ఓ స‌రదా వీడియోని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడు.

  Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
  మంచు లక్ష్మీని వదలకుండా వర్మ ట్వీట్స్

  మంచు లక్ష్మీని వదలకుండా వర్మ ట్వీట్స్

  వీడియోలో ఓ చిన్న‌పాపను వాళ్ల అమ్మ ఒంటికి బ‌ల‌మొస్త‌ది మిల్క్ తాగుతావా అని అడుగుతుంది. అప్పుడు ఆ పాప మంచు ల‌క్ష్మీని ఇమిటేట్ చేస్తూ రిప్లై ఇస్తుంది. ఆ ఫన్నీ వీడియోను నెటిజ‌న్ల‌తో పంచుకున్న‌ రామ్ గోపాల్ వర్మ కరోనా నుంచి కాస్తా గ్యాప్ తీసుకుని ఈ పాప‌ ఎవరని ఇమిటేట్ చేసిందో తెలిస్తే నాకు చెప్పండి అంటూ ట్వీట్ చేసాడు. దీనికి మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మంచు ల‌క్ష్మీ ప‌న్నీ వీడియోల‌ను తెగ పోస్ట్ చేస్తున్నారు . ఇక వర్మ ట్వీట్ చూసిన‌ మంచు లక్ష్మీ 'సార్' అంటూ న‌వ్వుతోన్న ఈమోజీస్ పెట్టింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఖాళీగా కూర్చోలేక వర్మ ఇలా నెట్టింట హల్చల్ చేస్తున్నారు.

  English summary
  Controversial director Ram Gopal Varma is making interesting tweets about the corona virus as a social media platform. Varma released a song he had written and sung in a non-sink voice 'Invisible worm' on Corona. He tested the netizens patience with his actions. He tweeted that doctor said that he was corona positive. Varma re-posted in the tweet just now that the doctor said it was an April fool joke .. It was not my fault Varma stated .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X