వైఎస్ ఫార్ములాతో రేవంత్, హైకమాండ్ ఫ్లాట్ - నాడు కేవీపీ.. నేడు వేం..!!
నాడు వైఎస్..నేడు రేవంత్. నాడు కేవీపీ.. నేడు వేం నరేందర్ రెడ్డి. అదే ఫార్ములా.. అదే టార్గెట్. రేవంత్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు. బై పోల్స్.. మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో హైకమాండ్ వద్ద పట్టు పెంచుకున్నారు. సీఎం అయిన నాటి నుంచి పార్టీ హైకమాండ్ ను మెప్పించేందుకు తొలి నుంచి ప్రయత్నించారు. ఇందుకు పూర్తిగా వైఎస్సార్ అమలు చేసిన ఫార్ములానే రేవంత్ కొనసాగించారు. "అన్నింటా" హైకమాండ్ కు అభయం ఇచ్చారు. అదే సక్సెస్ మంత్రగా మార్చుకున్నారు.
వైఎస్సార్ తరువాత ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు ఆదరణ ఉన్న నేతగా రేవంత్ కనిపిస్తు న్నారు. తెలంగాణ ఇచ్చినా రెండు రాష్ట్రాల్లోనూ నష్టపోయిన కాంగ్రెస్ పదేళ్ల తరువాత అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ లో చేరిన సమయం నుంచే ఢిల్లీ కేంద్రంగా సైలెంట్ ఆపరేషన్ అమలు చేసారు. అదే సీనియర్లు పోటీ పడ్డా..ఎందరు అడ్డు చెప్పినా టీపీసీసీ పదవి దక్కటానికి కారణం అయింది. ఆ పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని రేవంత్ స్పష్టం చేసారు.

కాంగ్రెస్ కు మింగుడపడని కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ..హైకమాండ్ ను ఆకట్టుకున్నారు. హైకమాండ్ ను ఎలా మేనేజ్ చేయాలో నాడు వైఎస్సార్ అమలు చేసిన ఫార్ములానే కొనసాగిస్తూ.. హైకమాండ్ తన మాట విశ్వసించేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. నాడు వైఎస్ ప్రత్యర్థుల విషయంలో తన సక్సెస్ తో హైకమాండ్ తన మాట కాదనలేని పరిస్థితి తో ముందుకు సాగారు.
నాడు కేవీపీ.. నేడు వేం ఒకే తరహాలో ఎంపిక
నాడు వైఎస్సార్ తన ఆత్మీయుడు కేవీపీ రామచంద్ర రావుకు రాజ్యసభ ఇప్పించుకున్నారు. ఢిల్లీ లో తన మనిషిగా కేవీపీకి అవకాశం కల్పించారు. ఆ తరువాత ఢిల్లీ హైకమాండ్ నేతలతో మరింత గా సంబంధాలు బల పడ్డాయి. ఇప్పుడు రేవంత్ సైతం తన స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి కి రాజ్యసభ సీటు ఖరారు చేయించటంలోనూ ఇదే ఫార్ములా అనుసరించారు. అనేక మంది పేర్లు చివరి వరకు రేసులో ఉన్నా... సామాజిక లెక్కలు తెర మీదకు వచ్చినా.. తన పంతం హైకమాండ్ వద్ద నెగ్గించుకున్నారు.
సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఈ నిర్ణయం ద్వారా క్లియర్ సంకేతాలు ఇచ్చారు. టీడీపీలో ఉన్న సమయం నుంచి వేం నరేందర్ రెడ్డి. రేవంత్ మధ్య స్నేహం కొనసాగుతోంది. తాను సీఎం అయిన తరువాత వేం కు సలహాదారు పదవి ఇచ్చారు. రెండేళ్ల తరువాత ఇప్పుడు రాజ్యసభకు పంపుతున్నారు. సలహదారు పదవిలోనూ కొనసాగనున్నారు. దీని ద్వారా రేవంత్ 2028 మిషన్ ఏంటనేది స్పష్టం అవుతోంది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications