నక్కతోక తొక్కిన వేణుస్వామి భార్య!!

ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి కంటే ఆయన సతీమణి వీణ శ్రీవాణి గ్రేట్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు. వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణి అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలలో అద్భుతమైన వీణా వాదన చేసి, ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు.

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో భాగాస్వామ్యమైన వేణు స్వామి భార్య
ప్రపంచంలోని ప్రముఖులందరూ హాజరైన ఈ వివాహ వేడుకలలో వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణి భాగస్వామ్యం అయ్యారు. వివాహ వేడుకలకు వచ్చిన అతిథులను అలరించడానికి వారు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలలో వీణ శ్రీవాణి కూడా ఒక స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వీణ వాయించడంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న వీణ శ్రీవాణి అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ఇచ్చిన స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో ఇప్పుడు ఆమెపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Venu Swamy wife great with her special performance of veena in anant ambani wedding

వేణు స్వామికి దొరకని అదృష్టం
అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లడానికి ఆహ్వానించిన అతిథులకు మాత్రమే అవకాశం ఉంది. ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామికి దొరకని అవకాశం ఆయన సతీమణి వీణ శ్రీవాణికి దొరకడంతో ఎంతైనా ఆమె టాలెంట్ ను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు నెటిజన్లు. తెలుగువారి తరఫున అనంత్ అంబానీ వెడ్డింగ్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె చెప్పారు.

వీణ శ్రీవాణికి అంబానీ కుటుంబం ఆదరణ
మన తెలుగుదనాన్ని, సంప్రదాయాన్ని రిప్రెజెంట్ చేసేలా తన డ్రెస్ కాస్ట్యూమ్ ను నీతా అంబానీ సెలెక్ట్ చేశారని, వీణా ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ కూడా చాలా అద్భుతంగా ఉందని వీణ శ్రీవాణి తెలిపారు. అంబానీ కుటుంబం తనను బాగా చూసుకుందని ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఎంతో గౌరవించి తన పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఇచ్చిందని వీణ శ్రీవాణి చెప్పారు.

వేణు స్వామి కంటే ఆయన వైఫే గ్రేట్
ఎలాంటి పాటనైనా వీణ మీద ప్లే చేయగలిగిన టాలెంట్ ఉన్న వీణ శ్రీవాణి వేణు స్వామి భార్య కావడంతో ఆమె పైన కూడా ప్రత్యేకంగా అందరి దృష్టి ఉంది. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామికి రాని అవకాశం వీణ శ్రీవాణికి రావడంతో ఎంతైనా వేణు స్వామి కంటే ఆయన వైఫే గ్రేట్ అంటూ, ఆమె నక్క తోక తొక్కిందని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+