హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు నాల్కల దోరణి, అలా గప్పాలు కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలా?: విజయశాంతి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు.

అప్పుడు గప్పాలు కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలా?: విజయశాంతి

అప్పుడు గప్పాలు కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలా?: విజయశాంతి

గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని... కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని... తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన కేసీఆర్‌ .. నేడు రైతుల పై రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ కేంద్ర విధానాలను అనాలోచితంగా తప్పుబడుతున్నారని మండిపడ్డారు విజయశాంతి. అనవసరంగా ధర్నాలు చేస్తామనడం హస్యాస్పందగా ఉందన్నారు

కేసీఆర్ డ్రామాలు మొదలెట్టారంటూ విజయశాంతి ఫైర్

కేసీఆర్ డ్రామాలు మొదలెట్టారంటూ విజయశాంతి ఫైర్

పారాబాయిల్డ్ రైస్ విషయంలో తప్ప... రా రైస్ కొనబోమని ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం గానీ, ఎఫ్‌సీఐ గానీ చెప్పలేదు. రా రైస్ కోసం రైస్ మిల్లర్లను సిద్ధం చేయించాల్సిన రాష్ట్ర సర్కార్... యాసంగిలో రైతులు అసలు వరి వేయవద్దంటూనే, వానాకాలం వడ్లు కల్లాలలో పోసి నెల దాటినా కొనకుండా తాత్సారం చేస్తుందన్నారు విమర్శించారు విజయశాంతి. వర్షాలకు తడిసి ధాన్యం పాడవుతున్నా కొనుగోళ్లు వేగవంతం చేయకుండా యాసంగి వడ్ల కొనుగోలుపై మళ్ళీ ధర్నా పేరుతో డ్రామాలు మొదలెడుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకో వడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన, బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు.

Recommended Video

ప్రజా సంగ్రామ యాత్ర పాటలను విడుదల చేసిన విజయ శాంతి..!! || Oneindia Telugu
నీచరాజకీయాలు చేస్తున్నారంటూ కేసీఆర్‌పై విజయశాంతి

నీచరాజకీయాలు చేస్తున్నారంటూ కేసీఆర్‌పై విజయశాంతి

రైతు సమస్యలు ఎలాగూ పట్టని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌... కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిల్వలుండి... అరోగ్యం విషయంలో సైతం భిన్నాభిప్రాయాలున్న పారాబాయిల్డ్ , స్టీమ్ రైస్‌ను అడ్డుకోకుండా కేంద్రం చూస్తోందన్నారు విజయశాంతి. హుజూరాబాద్‌లో ఓటమి నైరాశ్యంతో, అనవసరంగా కేంద్రాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె విమర్శించారు. దళారులతో సిండికేట్‌గా మారి అఫీషియల్‌గా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ నీచ రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు పతనం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రైతాంగం కేసీఆర్‌కు ఖచ్చితంగా బద్ధి చెబుతారని విజయశాంతి వ్యాఖ్యానించారు.

English summary
VijayaShanthi lashes out at CM KCR for crop purchase issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X