డిఎస్ స్థానంలో సలహాదారుగా వివేక్, కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ పార్లమెంటు సభ్యులు జి వివేక్‌ను నియమించారు. ఇప్పటి వరకు డి శ్రీనివాస్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయన స్థానంలో తెలంగాణ సర్కార్ వివేక్‌ను నియమించింది. అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు.

Vivek replaces D Srinivas as Advisor

కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ రోజు (బుధవారం) పదవీ విరమణ చేయనున్నారు. సచివాలయ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు సీఎస్‌కు వీడ్కోలు సభ ఏర్పాటు చేయనున్నారు. వీడ్కోలు సభకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కానున్నారు.

Vivek replaces D Srinivas as Advisor

రాజీవ్ శర్మ స్థానంలో నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను ప్రభుత్వం నియమించనుంది. ప్రదీప్ చంద్ర నియామకానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారు. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
G Vivek replaces D Srinivas as Telangana Government Advisor.
Please Wait while comments are loading...