హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం: ఏ3 ఉదయ్ సింహా అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సుదీర్ఘంగా కొనసాగుతున్న ఓటుకు నోటు కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ీ కేసులు ఏ-3గా ఉన్న ఉదయ్ సింహాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్ సింహాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

 vote for cash case: ACB arrests A3 uday simha

ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఉదయ్ సింహాను అరెస్ట్ చేశారు. ఉదయసింహాను గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇప్పుడు కీలకంగా మారింది.

ఇది ఇలావుంటే, ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ హైకోర్టులో ఇటీవల చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Recommended Video

ISRO's PSLV-C49 Successful: India's earth observation satellite and 9 others

కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి.

English summary
vote for cash case: ACB arrests A3 uday simha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X