వరంగల్ పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ కాదు.. బయటకు వచ్చింది: సీపీ ఏ.వీ రంగనాథ్!!
వరంగల్: పదవ తరగతి పరీక్షల ప్రారంభం నుండి ప్రశ్నాపత్రాల లీకేజ్ కలకలంగా మారింది. నిన్నటికి నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీక్ కాగా, వరంగల్లో నేడు పదవ తరగతి పరీక్షలలో హిందీ ప్రశ్నాపత్రం వాట్సప్ గ్రూపులలో చక్కర్లు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే వరంగల్లో ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. హిందీ క్వశ్చన్ పేపర్ పరీక్ష సమయంలోనే బయటకు వచ్చిందని ధృవీకరించిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, పేపర్ బయటకు వచ్చిన అంశంపై సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సాయంత్రానికల్లా అసలు విషయం తేలుతుందని పేర్కొన్నారు.
పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత పేపర్ వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చిందని, అంటే పరీక్ష సగం అయిన తరువాతనే పేపర్ బయటకు వచ్చింది కాబట్టి దానిని లీక్ అనడం సరికాదని పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇక పేపర్ లీకేజ్ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, హనుమకొండ జిల్లా విద్యా శాఖాధికారి అబ్దుల్ సిపిని కలిసి ఫిర్యాదు చేయగా దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఒక మీడియా ఛానల్ కు సంబంధించిన మాజీ రిపోర్టర్ ద్వారా పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని, అయితే అతనికి ఎక్కడి నుండి వచ్చింది అనేది తేలాల్సి ఉందని పేర్కొన్నారు. బహుశా ఇన్విజిలేటర్ ఎవరైనా ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్ల పేపర్ బయటకు వచ్చి ఉంటుందని భావిస్తున్నామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని ఒక పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో ప్రశ్నాపత్రాన్ని పెట్టినట్టు తెలుస్తున్నా .. అధికారికంగా అది ధృవీకరణ కావలసి ఉంది.
ఏది ఏమైనా వరంగల్ జిల్లాలో బయటకు వచ్చిన ప్రశ్నాపత్రం వ్యవహారం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. ఇంకా పదవ తరగతి పరీక్షలు కొనసాగాల్సి ఉండగా, ముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ఈ లీకేజీలేమిటో అన్న భయం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications