కడియం శ్రీహరి బద్ధ శత్రువుకు వరంగల్ ఎంపీ టికెట్?కేసీఆర్ స్ట్రాటజీ!!

వరంగల్ లోక్సభ స్థానానికి ఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అభ్యర్థిని ఖరారు చేశారు .వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరికి బద్ధ శత్రువైన తాటికొండ రాజయ్య పేరును ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కెసిఆర్, కడియం కావ్య ని ఓడించడమే లక్ష్యంగా తాటికొండ రాజయ్యను బరిలోకి దింపుతున్నట్టు సమాచారం.

కడియం కు షాకిచ్చేలా శత్రువుకు టికెట్
కడియం శ్రీహరిని ఓడించగలిగిన, కడియం కావ్యకు గట్టి పోటీ ఇవ్వగలిగిన నేతగా తాటికొండ రాజయ్యను ఎంపిక చేసిన కెసిఆర్, తాటికొండ రాజయ్యకు కబురు పంపారు. దీంతో హుటాహుటిన రాజయ్య కేసీఆర్ ఫామ్ హౌస్ కి బయలుదేరారు . రాజయ్య తో భేటీ అయిన అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలలో తాటికొండ రాజయ్యకు కెసిఆర్ టికెట్ ను నిరాకరించి ఆ టికెట్ ను కడియం శ్రీహరికి ఇచ్చారు. అక్కడ కడియం శ్రీహరి విజయం సాధించారు.

Warangal MP Ticket for Kadiam Srihari Enemy KCR Strategy

వరంగల్ లోక్సభ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య
అయితే తనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసహనంతో ఉన్న తాటికొండ రాజయ్య, చాలాకాలం పాటు మౌనంగా ఉండి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాటికొండ రాజయ్య ఏ పార్టీలోను చేరలేదు. కెసిఆర్ నుంచి టికెట్ విషయంలో స్పష్టమైన హామీ వస్తే మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

అప్పుడే ప్రచారం సాగిస్తున్న ఆరూరి రమేష్
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్థులుగా ప్రకటించబడిన వారు, క్షేత్రస్థాయిలోకి వెళుతూ పార్టీ శ్రేణులను, ప్రజలను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. బిజెపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆరూరి రమేష్ లోక్సభ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో కడియం కావ్య
కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగాప్రకటించబడిన కడియం కావ్య, పార్టీ ముఖ్య నాయకులను కలుస్తూ ఈ ఎన్నికల్లో విజయానికి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ నుండి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి బాబు మోహన్ ఎన్నికల బరిలోకి దిగినట్లు తాజాగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+