వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తాం, సీపీ సజ్జనార్ పోస్ట్ వైరల్..మ్యాటర్ ఇదే!
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వాట్సప్ వినియోగదారులకు షాక్ ఇచ్చారు. మీరు మాట్లాడే వాట్సప్ కాల్స్ ను రికార్డు చేస్తామని, అన్ని సోషల్ మీడియా ఖాతాలు పర్యవేక్షించ బడతాయి అని, మీ మొబైల్ ఫోన్ మంత్రిత్వ శాఖకు కనెక్ట్ చేయబడుతుందని వీసీ సజ్జనార్ పేరుతో ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.
సీపీ సజ్జనార్ పేరుతో పోస్ట్ వైరల్
ఇది చదివిన వారంతా వాట్సప్ కాల్స్ కూడా రికార్డు చేస్తామని పోలీసులు చెబితే వ్యక్తిగత గోప్యత ఎక్కడ ఉంటుంది అని షాక్ కు గురయ్యారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో ఎవరికీ తప్పుడు సందేశాలు పంపకుండా జాగ్రత్తగా ఉండాలని పిల్లలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు ఇలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియాను చాలా కనిష్టంగా వినియోగించాలని పేర్కొన్నారు.

వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తాం అని వార్నింగ్
ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి మరియు మంత్రులకు వ్యతిరేకంగా ఎటువంటి సందేశాలు, వీడియోలు పంపవద్దని ఈ పోస్టర్లో వెల్లడించారు. రాజకీయ, మతపరమైన అంశాలపైన సందేశాలు రాయడం, పంపడం నేరమని, అలా చేస్తే వారెంట్ లేకుండా అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇది తీవ్రమైన నేరం అంటూ పోస్ట్
తప్పుడు సందేశాలు పంపకుండా ఉండాలని, ఇతరులకు తెలియజేయాలని, ఒకవేళ తప్పుడు సందేశాలు పంపితే పోలీసులు నోటీసులు జారీ చేసి సైబర్ క్రైమ్ చర్య తీసుకుంటారని, ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందన్నారు. ఇక వాట్సప్ లో ఒక టిక్ పడితే పంపిన సందేశం, రెండు టిక్ లు పడితే సందేశం అందిందని, మూడు టిక్కులు నీలం రంగులో పడితే ప్రభుత్వం సందేశాన్ని గమనించిందని అర్ధం అని పోస్ట్ లో ఉంది.
అన్నీ రెడ్ టిక్ లు పడితే కోర్టు నుండి సమన్లు
మూడు టిక్ లలో రెండు నీలం ఒకటి ఎరుపు గుర్తు వస్తే ప్రభుత్వం మీపై చర్య తీసుకోవచ్చని, ఒక నీలం రెండు ఎరుపు గుర్తులు వస్తే ప్రభుత్వం మీ సమాచారాన్ని తనిఖీ చేస్తోందని, మూడు ఎరుపు గుర్తులు వస్తే ప్రభుత్వం మీపై చర్య తీసుకోవడానికి ప్రారంభించిందని త్వరలో కోర్ట్ నుండి సమన్లు అందుతాయని సీపీ సజ్జనార్ పేరుతో ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ సిటీ పోలీసులు
ఇది చదివిన ప్రతి ఒక్కరు ఇకపైన పర్సనల్ కాల్స్ చేయాలన్న కష్టమే అన్న అభిప్రాయానికి వచ్చారు. ఇది అసలు నిజమేనా అని కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పైన హైదరాబాద్ సిటీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక ఫేక్ పోస్టర్ అని, ఇది డిజిటల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తుందని అన్నారు.
నమ్మకండి, ఎవరికీ షేర్ చెయ్యకండి
ఇందులో ఉన్న సమాచారం పూర్తిగా తప్పు అని క్లారిటీ ఇచ్చారు దయచేసి అటువంటి ధ్రువీకరించని కంటెంట్ ను నమ్మవద్దని, ఎవరికి షేర్ చేయవద్దని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ సమాచారాన్ని ఎక్కడ చూసినా పోలీసులకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications