weather forecast: తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉపరితల ద్రోణి విదర్భా నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది.
బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం, గురువారం, శుక్రవారం తెలంగాణలోని నైరుతి, తూర్పు జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది.

రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో చాలా జిల్లాల్లో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వ్యాపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, పగటిపూట మాత్రం కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమానానర్హం. సాయంత్రం వరకు వాతావరణంలో మార్పులు వచ్చి చల్లబడుతోంది. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications