పవన్ నామస్మరణ, పాటలకు డ్యాన్స్‌లు: మరో 'ప్రజారాజ్యం'పై క్లారిటీ!
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో, ముఖ్యంగా కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామస్మరణ కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ జేఎన్టీయూ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుంది. దీంతో దారున్నీ సభా ప్రాంగణం వైపే సాగుతున్నాయి.
పాదాభివందనం: పవన్ 'సీమాంధ్ర' సభకు తెలంగాణ ఫ్యాన్స్, అందుకే రాక
ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే ముప్పై, నలభై వేల మంది వచ్చారు. వాళ్లంతా పవర్ స్టార్, జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు. పవన్ పాటలకు నృత్యాలు చేస్తున్నారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు.
సభా ప్రాంగణం చుట్టుపక్కలా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మైదానంలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్లతో సోదాలు జరిపిన తర్వాతనే అనుమతిస్తున్నారు. కాకినాడ వీధులన్నీ పవన్ పోస్టర్లతో నిండిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాలతో పాటు తెలంగాణ నుంచీ అభిమానులు ప్రత్యేక వాహనాల్లో సభకు తరలి వచ్చారు.

కంటి ఆసుపత్రికి పవన్
పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ముందు స్థానిక కంటి ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఆయన ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొంటారు.
75వేల మందికే
సభకు లక్ష మందికి పైగా వస్తారని భావిస్తున్నారు. అయితే జేఎన్టీయూ ప్రాంగణంలో కేవలం 75వేల మందికి మాత్రమే అవకాశముంది. దీంతో ఎలాంటి తోపులాట, అవకతవకలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రెండువేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరో ప్రజారాజ్యం కావొద్దని...!
పవన్ స్థాపించిన జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ కావొద్దని చాలామంది కోరుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాందిపలుకుతుందనుకున్న ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో సత్తా చాటింది. అధికారంలోకి వస్తుందని భావించినా, సీట్ల పరంగా నిరాశపరిచినా అది చిరంజీవి సత్తాను చాటింది. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో కలిసింది.
క్లారిటీ వచ్చాక, ఇది సీరియస్: పవన్ కళ్యాణ్ ప్రశ్నించే ముందు..!
ఇప్పుడు, జనసేన పార్టీ పైన ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే, జనసేన టిడిపికి అనుకూలమా, బీజేపీకి అనుకూలమా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన మరో ప్రజారాజ్యం కావొద్దని కోరుకుంటున్నారు. దీనిపై పవన్ కూడా తిరుపతి సభలో స్పష్టత ఇచ్చారు. తనను బీజేపీ ముఖ్య నేతలు పార్టీలోకి ఆహ్వానించారని, కానీ తిరస్కరించానని చెప్పారు.












Click it and Unblock the Notifications