ఇద్దరు భార్యల మధ్య సర్పంచ్ పోరు..భర్త ఏమవుతాడో!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామపంచాయతీలు ఎన్నికలను ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కనివిని ఎరుగని సంఘటనలు కనిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మేనిఫెస్టోలో కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. ఇక కొన్ని చోట్ల అయితే ఎన్నికల పోటీలలో విచిత్ర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటన సిద్దిపేట జిల్లా జంగంపల్లి గ్రామంలో వెలుగు చూసింది.

ఇద్దరు భార్యలతో సర్పంచ్ నామినేషన్లు వేయించిన భర్త
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం జంగపల్లి గ్రామంలో వెలుగు చూసిన ఈ విచిత్ర ఘటన వివరాలలోకి వెళితే, జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అయితే నామినేషన్ల ప్రక్రియలో భర్త తన ఇద్దరు భార్యలతో నామినేషన్ దాఖలు చేయించారు. నవంబర్ 30వ తేదీన మొదటి భార్యతో నామినేషన్ వేయించారు. ఆ తర్వాత తప్పులుంటే తొలగిస్తారు అన్న భయంతో రెండవ భార్యతోను నామినేషన్ దాఖలు చేయించారు.

What will happen to the husband in the Sarpanch fight between the two wives in siddipet district

బరిలో ఆ ఇద్దరే
నామినేషన్ల దాఖలు ముగిసే టైం కి ఆ గ్రామంలో మరి ఏ ఇతరులు నామినేషన్లను దాఖలు చేయలేదు. దీంతో నామినేషన్ల దాఖలు ముగిసిన సమయానికి పోటీలో ఆ ఇద్దరే మిగిలారు. ఇద్దరు భార్యలు బాగా చదువుకున్న వారే.. ఇద్దరిలో ఒకరు నామినేషన్ ను ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతుంది. అయితే ఇద్దరిలో ఎవరి నామినేషన్ ను ఉపసంహరించుకుంటారు. భర్త ఎవరికి మద్దతిస్తారు అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు.

భర్త మద్దతు ఏ భార్యకు
ఒకరికి మద్దతిచ్చి, ఒకరిని వద్దంటే వారు ఊరుకుంటారా? ఇద్దరు భార్యలతో సుఖంగా సాగుతున్న జీవితంలో సర్పంచ్ పదవి ఏమైనా చిచ్చు పెడుతుందా అని కొందరు చర్చిస్తే, ఇద్దరు భార్యలు అఫీషియల్ కాదు కదా, అనఫీషియల్ కదా, అఫీషియల్ గా హక్కు ఉన్న భార్యకే పట్టం కదతాడేమో అని కొందరు, ప్రేమ ఎవరిపై ఎక్కువ ఉంటే వారికే అవకాశం ఇస్తాడు అని మరికొందరు చర్చిస్తున్నారు.

ఎవరి నామినేషన్ ఉపసంహరించుకుంటారు? సందిగ్ధంలో భర్త
ఒకరి నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతున్న క్రమంలో ఇద్దరిలో ఎవరిని గెలిపించాలి అన్న సందిగ్ధంలో భర్త కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మొదట నామినేషన్ దాఖలు చేయించింది మొదటి భార్యతో కాబట్టి ఆమె వైపు మొగ్గు చూపుతారేమో అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇంతకీ ఇరువురి సతుల మధ్య సర్పంచ్ పోరులో పతి ఏమవుతాడు అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+