వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవి బస్సులా... మ‌‌ృత్యుశకటాలా...! కొద్ది గంటల్లోనే మూడు బస్సు ప్రమాదాలు !

|
Google Oneindia TeluguNews

రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. కొద్ది గంటల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు జరిగి ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాగా ప్రమాదానికి ప్రధాన కారణం పెద్ద పెద్ద బస్సులు అవుతుండడం, మరోసారి బస్సుల్లో ప్రయాణించే వారికి జంకును తెప్పిస్తున్నాయి. ఫోర్ వీలర్లను వదిలి సేఫ్ కోసం పెద్ద పెద్ద బస్సుల్లో వెళ్తున్నా.. ప్రమాదాలు మాత్రం తప్పేట్టు లేవు..

శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి బెంగళూర్ వైపు అతివేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావేల్స్ బస్సు కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గరలో ఎదురుగా వస్తున్న టూ వీలర్‌ను తప్పించబోయి పక్కనే ఉన్నడివైడర్ డీకొట్టింది. దీంతో డివైడర్ మీదకు ఎక్కి అవతలి వైపు వస్తున్న తుఫాన్ ఫోర్ వీలర్ వాహానాన్ని బలంగా ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొట్టడడంతో తుఫాన్ వాహనంలో ఉన్న 13 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీంతో బస్సు ఎంత వేగంగా జాతీయ రహదారీపై వెళుతుందనేది అర్ధం చేసుకోవచ్చు. అధిక స్పీడ్‌తో కంట్రోల్ తప్పి ఇతరుల ప్రాణాలను హరించింది. దీంతో బస్సులో ఉన్నవారికి కూడ తీవ్రంగా గాయాలయ్యాయి..

whether these are buses or dead vehicles

కాగా ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా జాతీయ రహదారిపై మరో మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీకి చెందిన బస్సు కరీంనగర్ దగ్గరలోని నుస్తులాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ తోపాటు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇక గాయపడ్డ ప్రయాణికులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఆదివారం మధ్యహ్నాం సమయంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని బండపల్లి వద్ద మరో ప్రవైట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ బస్సు బెంగళూర్ నుండి తిరుపతికి వెళుతుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 17 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

English summary
with in few hours Three accidents occurred in both telugu states. in thease accidents at least 16 passengers were died and 40 of the casualities.and the main reason for accidents by buses.then people hazard to travel by bus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X