బండి సంజయ్, రేవంత్ కంటే ఎక్కువ నిధులు తెచ్చానన్న ఎంపీకి కేసీఆర్ టికెట్ ఇస్తారా?

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ పార్టీలో పోటీ నెలకొనడంతో టికెట్ పై గందరగోళం నెలకొంది. వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, మళ్లీ తనకే బీఆర్ఎస్ నుండి టికెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులకు నిధులు , ఏపీ విభజన చట్టంలో పొందు పరిచిన నిధులు, తెచ్చానన్నారు. అమృత్, స్మార్ట్ సిటీ, హృదయ్ కు 3వేల 2వందల 6 కోట్లు పైగా నిధులు తెచ్చానని, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశానని పేర్కొన్నారు.

Will KCR give ticket to the MP who brought more funds than Bandi Sanjay and Revanth reddy?

రాష్ట్రంలో ఉన్న అందరూ ఎంపీల కంటే ఎక్కువ నిధులు తాను తెచ్చానని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశానని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకంగా పనిచేసిన తనకు మళ్లీ పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి,ఎంపీ బండి సంజయ్,సీఎం రేవంత్ రెడ్డి కంటే తాను వరంగల్ కు ఎక్కువ నిధులు తెచ్చానని ఎంపీ పసునూరి దయాకర్ పేర్కొన్నారు.

వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేశానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ ఎంపీల కన్నా తాను ఎక్కువ నిధులు తెచ్చానని చెప్పిన ఎంపీ పసునూరి దయాకర్ వచ్చే ఎన్నికలలో అధిష్టానం తనకు టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశానని, ఆపై ఎంపీగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించానని ఎక్కడ అభివృద్ధి పనుల విషయంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఎక్కడా అవినీతి మరక లేకుండా పనిచేశానని పసునూరి దయాకర్ పేర్కొన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందని పేర్కొన్నారు.

అధిష్టానం అవకాశం ఇస్తే మళ్లీ లోక్సభ ఎన్నికలలో వరంగల్ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అంతే కాదు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని ఎంపీ పసునూరి దయాకర్ కెసిఆర్ పట్ల విధేయతను ప్రదర్శించారు. బండి సంజయ్, రేవంత్ కంటే ఎక్కువ నిధులు తెచ్చానన్న ఎంపీకి కేసీఆర్ టికెట్ ఇస్తారా.. లేదా అనేది త్వరలోనే తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+