వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు గండ్ర షాక్ : పార్టీ వీడుతున్నట్టు ప్రకటన, కేటీఆర్‌తో గండ్ర దంపతుల భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గండ్ర దంపతులు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించగా ... గండ్రతో ఆ సంఖ్య 11కి చేరింది.

హామీలు నెరవేర్చేందుకే ..

తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతోన్న సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు గండ్ర పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకించి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తిచేసేందుకు గులాబీ గూటికి చేరుతున్నట్టు స్పష్టంచేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవీతోపాటు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గండ్ర భార్య జ్యోతి తెలిపారు.

will resign congress says gandra

వీడనని చెప్పి ...
అధికార టీఆర్ఎస్ లో మరికొందరు ఎమ్మెల్యేలు చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో గండ్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఈ క్రమంలో శనివారం భట్టి నివాసంలో జరిపిన చర్చలకు గండ్ర హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది. అయితే ఆదివారం భట్టి విక్రమార్కతో కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా భట్టికి తాను పార్టీలో చేరడం లేదని తెలిపినట్టు సమాచారం. అయితే సోమవారమే కేటీఆర్ ను కలిసి పార్టీలో చేరుతానని ప్రకటించి ఆ పార్టీ నేతలు విస్మయానికి గురిచేశారు గండ్ర.

English summary
In Telangana, the Congress has another shock. The party's Bhopalapalli MLA Gandra Venkata Ramana Reddy announced that resign for party. Gandra met with TRS Working President Ktr. Ten MLAs from the Congress party announced that they would leave the party and reached number 11 with the Gandra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X