హైదరాబాద్ రోడ్ల దుస్థితి: నీటిగుంతలో కూర్చుని మహిళ నిరసన
హైదరాబాద్ నగరంలో భారీ వర్షమైనా.. చిన్న వర్షమైనా రహదారులు జలమయమవుతాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇక, రోడ్లు బాగాలేని ప్రాంతాల్లో అయితే, వాహనదారులు, ప్రజలకు నరకమే. భారీ వర్షంతో ఆ గంతల్లో చేరిన వరదనీర అలాగే ఉండి వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. అంతేగాక, ప్రమాదాలకు కూడా కారణమవుతాయి.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. హైదరాబాద్‌లో చాలా చోట్ల రోడ్లన్నీ గుంతలుగా మారాయని, వరద నీరు మిగిలిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు పక్కనే ఉన్న వరద నీటి గుంతలో కూర్చొని వినూత్న రీతిలో ఆమె నిరసన తెలిపారు. నాగోలు - బండ్లగూడ రహదారిలోని ఆనంద్ నగర్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆ మహిళ పేర్కొన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వివరించారు.
A mother protests at Nagole by sitting in a pothole, venting ire over officials who have not taken repairs. She says that her kids fell due to a pothole
— Naveena (@TheNaveena) May 23, 2024
#Hyderabad
She said There are 30potholes from Uppal to Nagole.
To showcase the depth of the pothole and the danger it holds. pic.twitter.com/l6DHOPQjrx
కొత్త రోడ్డును నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు నచ్చజెప్పినా ఆమె వినలేదు. రోడ్డును పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని ఆమెను కదలకుండా అలాగే నిరసన వ్యక్తం చేశారు. ఆమెకు మద్దతుగా స్థానికులు కొందరు నిలిచారు. దీంతో సదరు మహిళ నిరసనతో దిగివచ్చిన అధికార యంత్రాంగం రోడ్లు మరమ్మతులు చేపడతామని, అవసరైమన చోట్ల కొత్తగా రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె తన నిరసనను విరమించారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications