మరో పది రోజుల్లో పెళ్లి.. గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో పది రోజుల్లో పెళ్లి, రేపు అంటే గురువారం కాబోయే భర్తతో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లాల్సిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం బాత్రూంలో ఉరివేసుకొని సాప్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొనిపరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు గచ్చిబౌలి పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం గోస్కుల పల్లికి చెందిన ముదాం విద్యశ్రీ(23) అనే యువతి గచ్చిబౌలిలోని కొత్తగూడలో ఉన్న పీజీ లేడీస్ హాస్టల్లో ఉంటుంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. సోమవారం విధులకు వెళ్లకుండా హాస్టల్లో ఉంటూ ఆమె సాయంత్రం 4 గంటల సమయంలో బాత్రూంలో షవర్ రాడ్‌కు టవల్‌తో ఉరివేసుకుంది.

ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది తనను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ఆ యువతి మృతి చెందింది. కాగా, మార్చి 17వ తేదీన యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. తన వివాహం ఉండటంతో తన హాస్టల్ రూమ్‌మేట్స్‌కు, తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలను పంచి, తప్పక రావాలని ఆహ్వానించింది. అయితే గురువారం కాబోయే భర్తతో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లాల్సి ఉంది.
అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ, హాస్టల్లోని బాత్రూంలో సోమవారం ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల్లో అత్తారింటికి వెళ్లాల్సిన కుమార్తె ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు యువతి కుటుంబసభ్యులు. పెళ్లి వేడుకలతో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications