వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిరహిత సమాజం కోసం పనిచేయండి..! అధికారులకు సీయం కేసీఆర్ ఆదేశాలు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అవినీతికి లేని రెవెన్యూ, పురపాలక చట్టాలు : కెసిఆర్ || Oneindia Telugu

హైదరాబాద్‌: బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ పూర్తిగా అవినీతి రహితంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాలక సంఘాల్లో, గ్రామ పంచాయతీల్లో ఎవరికీ ఎక్కడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా అన్ని పనులు జరగాలన్నారు. దీనికోసం కఠినమైన కొత్త రెవెన్యూ చట్టం, కొత్త పురపాలక చట్టం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు, ధ్రువీకరణ పత్రాల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలని చెప్పారు.

<strong>వామ్మో.. ఎన్నికల అదికారుల పేరిటే ఫేక్‌ ఓటరు కార్డులు..! అప్లై చేసిన దొంగల కోసం పోలీసుల వేట..!!</strong>వామ్మో.. ఎన్నికల అదికారుల పేరిటే ఫేక్‌ ఓటరు కార్డులు..! అప్లై చేసిన దొంగల కోసం పోలీసుల వేట..!!

సీయం సీరియస్..! లంచగొండి వ్యవస్థను రూపుమాపాలన్న కేసీఆర్..!!

సీయం సీరియస్..! లంచగొండి వ్యవస్థను రూపుమాపాలన్న కేసీఆర్..!!

ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ తరహాలో తెలంగాణ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియపై దృష్టి పెట్టాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త పురపాలక చట్టాల రూపకల్పనపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి..? ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి..?

ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి..? ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి..?

రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, పురపాలక సంఘాలలో, గ్రామ పంచాయతీలలో ఒక్క పైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలని, ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్‌ అధికారులకు వివరించారు. నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.

 లంచం లేని వ్యవస్థ..! ఉన్నత స్థాయి సమీక్షలో సీయం కేసీఆర్ వెల్లడి..!!

లంచం లేని వ్యవస్థ..! ఉన్నత స్థాయి సమీక్షలో సీయం కేసీఆర్ వెల్లడి..!!

ఇందుకోసం పటిష్ఠమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త పురపాలక సంఘాలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పనులు జరిగితేనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుందని అదికారులతో చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

 అవినీతికి ఆస్కారం లేని కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు..! ఉన్నత స్థాయి సమావేశంలో కేసీఆర్..!!

అవినీతికి ఆస్కారం లేని కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు..! ఉన్నత స్థాయి సమావేశంలో కేసీఆర్..!!

ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవు. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుద్ధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాలని అదికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సమాచారం.

English summary
cm kcr wanted Telangana to become completely non-corrupt. In revenue offices and municipalities, all the work should be done without paying bribe to anyone in the village panchayats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X