year ender 2022: సంచలనంగా ఎమ్మెల్యేల ఎరకేసు; బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్.. కానీ!!
2022 సంవత్సరం లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక పక్క కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, మరో పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఎరకేసు సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికల పోరు కొనసాగుతున్న సమయంలోనే, ఉప ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరిన దశలో ఒక్కసారిగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది.

తెలంగాణాలో హాట్ టాపిక్ అయిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
ప్రస్తుత బి ఆర్ ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీకి చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి వంద కోట్లుఇచ్చి కొనుగోలు చేయాలని బిజెపి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో ముగ్గురు స్వామీజీలతో చర్చలు జరిపినట్టు వీడియో, ఆడియో రికార్డింగ్ లతో గులాబీ పార్టీ బిజెపి ని టార్గెట్ చేసింది.
అనేక నాటకీయ పరిణామాల మధ్య పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో జరిగిన ఉదంతంలో నందకుమార్, సింహయాజీ, రామచంద్ర భారతీలను ముందు పెట్టి బిజెపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేస్తుందని, దీని వెనుక బీజేపీ పెద్ద తలలు ఉన్నారని ఆరోపించింది.

గులాబీ పార్టీ ఆరోపణలను ఖండించిన బీజేపీ
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలు అవుతామన్న భయం తో టిఆర్ఎస్ ఆడుతున్న కొత్త డ్రామా అని బిజెపిఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
అంతేకాదు ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తడిబట్టలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ముందు ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. అప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పై ఢిల్లీ లిక్కర్ కుంభకోణ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, కావాలని టిఆర్ఎస్ పార్టీ పక్కా స్కెచ్ వేసి ఈ డ్రామా చేశారని బిజెపి నాయకులు ఆరోపించారు.

ఎమ్మెల్యేల ఎరపై కేసీఆర్ సీరియస్, వీడియో, ఆడియో రికార్డ్ లతో హల్చల్
ఇక ఆ తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా వీడియో టేపు విడుదల చేసి, ఆడియోలీకులు ఇచ్చి కేంద్రంలో ఉన్న బిజెపి ని టార్గెట్ చేశారు. ఇక వాటిలో ఉన్న సమాచారాన్ని బట్టి, తెరవెనుక బిజెపి కి సంబంధించిన కీలక నాయకులు ఉన్నారని ఆరోపించారు.
ఎవరిని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీయల్ సంతోష్, తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ సునీల్బన్సాల్, కేరళకు చెందిన తుషార్, జగ్గు స్వామి ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విచారణను సిట్ కు అప్పగించింది.

సిట్ దర్యాప్తులో ఆది నుండీ అడ్డంకులే.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న సిట్
ఆపై సిట్ ఈ కేసు విచారణలో అడుగడుగున కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ స్వామి, నందకుమార్ లను అరెస్టు చేయడానికే సిట్ అధికారులు నానా పాట్లు పడాల్సి వచ్చింది . బిజెపి నాయకులు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బిజెపి దాఖలు చేసిన ఫిర్యాదుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు కేసు సుప్రీం కోర్టుకు చేరింది.
సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు, హై కోర్టుకు ఈ కేసు విషయంలో తిరుగుతూనే ఉన్నారు. కోర్టు ఆదేశాలతో నిందితులను అరెస్ట్ చేసి, విచారించి, వారి కాల్ డేటా ఆధారంగా కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ ను, మరో అడ్వకేట్ ప్రతాప్ గౌడ్ ను సిట్ అధికారులు విచారించారు.

దర్యాప్తులో కీలక సమాచారం .. అయినా అసాధ్యంగా మారుతున్న సిట్ విచారణ
ఇక అనుమానితులుగా బీయల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే వారు కోర్టును ఆశ్రయించి నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. వారిని అరెస్ట్ చేసి అయినా విచారణ చెయ్యాలని భావించిన సిట్ కు చేదు అనుభవం ఎదురైంది.
ఇక నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామి ల పై లోతుగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు వారికి సంబంధించిన అనేక కీలక సమాచారాన్ని సేకరించారు. రామచంద్ర భారతికి పై నకిలీ పాస్పోర్టు కేసు ఉందని, ఇక నందకుమార్ అనేక చీటింగ్ కేసు లలో ఉన్నారని ఎమ్మెల్యేల ఎర కేసు తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో వారిని హాజరుపరిచి రిమాండ్ ఖైదీలుగా చంచల్ గూడా జైలుకు పంపించారు.

వారికి నోటీసులు ఇచ్చినా సాధ్యం కాని విచారణ.. సఫలం కాని తెలంగాణా ప్రభుత్వ యత్నం
ఇప్పటివరకూ బీయల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ, వారిని విచారించటానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. కోర్టుల చుట్టూ సిట్ అధికారులు తిరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ కేసులో వీరిని దర్యాప్తు చేస్తేనే కేసు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
కానీ కోర్టు ఆదేశాల కారణంగా సిట్ అధికారులు ఈ కేసులో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఈ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, ఈ కేసులో కీలక బీజేపీ నేతలను ఇరికించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి సఫలం కావడం లేదు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 2023 సంవత్సరంలో ఏం జరగబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications