Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

year ender 2025: ఆ విజయంతో కాంగ్రెస్, సీఎం రేవంత్ కు బిగ్ బూస్ట్!

2025 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి , రేవంత్ ప్రభుత్వానికి ఉప ఎన్నిక రూపంలో ఒక మంచి బూస్ట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాష్ట్రంలో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ పైన ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. 2025లో జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు కూడా ఒక గీటురాయిగా మారింది అన్న అభిప్రాయం వ్యక్తం అయింది.

2025లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపారు. బిజెపి లంకల దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చింది.

year ender 2025 congress party and cm revanth graph increased with jubilee hills by poll victory

Take a Poll

కాంగ్రెస్ కు ప్రజలు అందించిన విజయం
చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్య రాజకీయ పార్టీలు భావించిన ఈ ఉప ఎన్నికల్లో అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి పైన 24 వేల 729 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.ఇక ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును అంగీకరిస్తూ ప్రజలు అందించిన ప్రజా విజయంగా, రేవంత్ నాయకత్వానికి ప్రజా అంగీకారంగా కాంగ్రెస్ శ్రేణులు భావించాయి.

ప్రజల మద్దతుతో పెరిగిన రేవంత్ గ్రాఫ్
రాష్ట్రంలో ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ఊదరగొడుతున్న వేళ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఊహించని విధంగా బూస్ట్ ఇచ్చింది. ప్రజల మద్దతు తమకే ఉంది అని వారు అనుకునేలా చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ఉప ఎన్నిక ఫలితాల ప్రభావంగా రేవంత్ గ్రాఫ్ పెరిగింది.

గ్రేటర్ హైదరాబాద్ లోనూ పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాలు, ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొనడం వంటి చర్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయానికి కారణమయ్యాయని రాష్ట్రంలో చర్చ జరిగింది. ఫలితంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి భారీగా బూస్ట్ వచ్చినట్టయింది.

కాంగ్రెస్, రేవంత్ గ్రాఫ్ పెంచిన 2025
బిజెపి, బిఆర్ఎస్ ను ఈ ఉపఎన్నిక బలహీనపరిచింది. అంతేకాదు పార్టీ లోపల రేవంత్ నాయకత్వం కూడా బలపడింది. మొత్తంగా 2025 సంవత్సరంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి గ్రాఫ్ పెంచింది అన్నది నిర్వివాదాంశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+