కదులుతున్న ఆర్టీసీ బస్సు పైకెక్కి యువకుడి రీల్స్: సజ్జనార్ ఏం చేశారంటే!!
ప్రస్తుతం జనాలకు సోషల్ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఏదో ఒకటి చేసే సోషల్ మీడియాలో హైలెట్ కావాలి అన్న ఆలోచనతో చేస్తున్న కొన్ని పనులు ఒక్కోసారి వారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. రైల్వే ట్రాక్ల పైన యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేసిన కొంతమంది రైళ్ళు ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
instagram, facebook లలో రీల్స్ చేసి ఆ వీడియోలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీ కావాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలోని తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక యువకుడు చేసిన పని చూసిన వారిని షాక్ కు గురి చేసింది.

హత్నూర మండలం నాగుదేవులపల్లి కి చెందిన సారతేజ ఆర్టీసీ బస్సు పైకి ఎక్కి చేసిన పని అందరిని నివ్వెర పోయేలా చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదివే సార తేజ సోషల్ మీడియాలో ఫేమస్ అవుదామంటూ ఆర్టీసీ బస్సు పైకి ఎక్కి, కదులుతున్న ఆర్టీసీ బస్సు పై ప్రమాదకరమైన రీల్స్ చేశాడు.
దౌల్తాబాద్ వైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కి హీరో రామ్ చరణ్ పాటపై రీల్స్ చేసిన సారతేజ హీరో లెవెల్లో ఫోజ్ ఇచ్చాడు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్టిసి బస్సు పై యువకుడు చేసిన ఫీట్ గుర్తించిన సార తేజకు ఆర్టిసి ఎండి సజ్జనార్ క్లాస్ పీకారు. ఆ యువకుడిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రమాదకరమైన రీల్స్ చేసి తల్లిదండ్రులకి కడుపు కోత మిగల్చవద్దు అంటూ సున్నితంగా హెచ్చరించారు ఎండి సజ్జనార్.
కదులుతున్న ఆర్టీసీ బస్సు పైకెక్కి యువకుడి రీల్స్..!! pic.twitter.com/sRuEb1dcaU
— oneindiatelugu (@oneindiatelugu) December 29, 2023
ఇంకెప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇంకోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆర్టిసి ఎండి సజ్జనార్ క్లాస్ పీకిన తర్వాత సారతేజ సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాడు. ఇకపై ప్రమాదకరమైన రీల్స్ చేయబోనని సదరు యువకుడు ప్రకటించాడు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications