Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడో కన్నుగా Sheteams: ఎవరూ చూడటం లేదని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా?

హైదరాబాద్: బహిరంగ ప్రదేశాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎవరూ చూడటం లేదని యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టిస్తున్నాయి షీ టీమ్స్. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారిని తాకడం, చేతులేయడం లాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నవారిని షీటీమ్స్ కటకటాల వెనక్కి నెడుతున్నాయి.

బహిరంగ, రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిల వికృత చేష్టలను షీటీమ్స్ వీడియో తీయడంతోపాటు వారిని వెతికి పట్టుకుని ఊచలు లెక్క పెట్టిస్తున్నాయి. ఇలాంటి ఆకతాయిలకు తగిన బుద్ధిచెప్పినట్లు ఓ వీడియోను తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

your activities are being watched, so behave properly: hyderabad police and she teams warning

బహిరంగ, రద్దీ ప్రదేశాల్లో అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్న పోకిరీలకు హైదరాబాద్ నగర పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనాలు గుమిగూడిన ప్రాంతాల్లో అమ్మాయిలను తాకుతున్న కొందరు యువకుల దృశ్యాలను షీటీమ్స్ వీడియో తీసి వారిని అరెస్ట్ చేశాయని తెలిపారు.

ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మీరు చేసే పనులన్నీ చూస్తున్నాం.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ షీటీమ్స్, హైదరాబాద్ పోలీసులు ఆకతాయిలు, పోకిరీలకు గట్టిగా హెచ్చరించారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలకు గురవుతారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఆకతాయిలు, పోకిరీల నుంచి రక్షించేందుకు నగరంలో షీటీమ్స్ విస్తృతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అమ్మాయిల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించే వారిని వెతికి మరీ పట్టుకుని తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నాయి షీటీమ్స్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+