దసరాకు స్నేహితులతో అలాయ్ బలాయ్.. కానీ చర్చించాల్సిందిదే: హరీష్ రావు

దసరా పండుగ రానే వచ్చింది. ఇక దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. పండుగకు వచ్చే బంధుమిత్రులతో జనాల ఇళ్లు కళకళలాడుతున్నాయి. అయితే దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు యువతకు ఒక ఆసక్తికరమైన పిలుపునిచ్చారు.

యువతకు హరీష్ రావు పిలుపు
గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని గ్రామాలలో యువత ప్రచారం చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం ప్రచారం చేసిన యువత ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాలని ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.

youth to discuss with friends and family on congress six guarentees cheating on Dussehra harish rao

కాంగ్రెస్ హామీలను టార్గెట్ చేసిన హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగా అమలు చేయలేదని ఊళ్ళల్లో అవ్వ తాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు బంధును నిలిపివేశారని, ఇక రైతు భరోసా దిక్కే లేకుండా పోయిందని రైతులకు ఇచ్చే బోనస్ ను బోగస్ చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి అలా ప్రచారం
సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని 10 నెలలు గడిచిన అతీగతీ లేదని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దానికి నీళ్లు వదిలారని 4 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఏమైంది అంటూ గుర్తు చేశారు .ఇక గత దసరా సమయంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఇప్పుడు అలోచించాలన్నారు.

కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
ఈ దసరాకు మీ ఊర్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని పేర్కొన్నారు. అంతే కాదు దసరా పండగ సందర్భంగా మీ ప్రాంతాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా నిలదీయాలని, తమకు ఇష్టమని హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లతోపాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ పై ప్రశ్నించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ తీరును ఎండ గడుతున్న హరీష్ రావు
ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ల పైన ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని హరీష్ రావు తన ట్వీట్ ద్వారా యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు విషయంలో పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సందర్భాన్ని బట్టి ప్రజలను కాంగ్రెస్ పార్టీ తీరును ఎండ కడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+