బూతుపురాణంలో ఆరితేరిన కేసీఆర్... ప్రశ్నిస్తే తిట్టినట్టా? మంత్రి నిరంజన్ రెడ్డికి వైఎస్ షర్మిల సవాల్!!
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వార్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు వైయస్ షర్మిల. తెలంగాణ సీఎం కేసీఆర్ , తెలంగాణ మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేల అవినీతిని టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్న వైఎస్ షర్మిలను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఆమె ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి పై ఎవడ్రా నీకు మరదలు.. నువ్వు వీధి కుక్క తో సమానం అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. షర్మిల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలపై డిజిపికి ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ రచ్చ కొనసాగుతోంది.

పాలమూరు నీళ్ళపోరు దీక్షలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల
ఇక ఇదే సమయంలో వైఎస్ షర్మిల తాజాగా మరోమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదని, పాలమూరు నీళ్ల పోరుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 24 గంటలు నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల కేసీఆర్ సర్కారు తీరు పై నిప్పులు చెరిగారు. జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి కి సవాల్ విసిరారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలుత ప్రారంభించిన ఈ మేజర్ ప్రాజెక్టు నిర్మాణంలో కెసిఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడిన వైయస్ షర్మిల, కమీషన్లు దోచుకున్నారు కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు, భూనిర్వాసితులకు న్యాయం చేసే వరకు పాలమూరు-నీళ్ల పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఈ దీక్షకు తరలివచ్చిన రైతులు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని వైఎస్ షర్మిల విమర్శించారు.

జిల్లా మంత్రికి రైతులపై ఉన్న ప్రేమ ఇదా?
తెలంగాణ ఏర్పడ్డాక పాలమూరు నుంచే నీళ్ల ఉద్యమం అంటూ ప్రాజెక్టు మొదలుపెట్టిన కేసీఆర్.. దీనిని పూర్తి చేయకుండా ఉత్త ముచ్చట్లు చెబుతూ, ఊసరవెల్లి నాటకాలు ఆడుతున్నారు అంటూ వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. ఎరువుల కోసం క్యూలో నిలబడి రైతులు చనిపోతే.. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సినిమా టికెట్ల కోసం చనిపోవడం లేదా? అంటూ పోల్చాడు.. ఇది ఎంతవరకు న్యాయము చెప్పాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.ఇదీ ఆయనకు రైతులపై ఉన్న ప్రేమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డిని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తే.. జిల్లా మంత్రిగా ఒక్కసారైనా ప్రశ్నించాడా? ఒక్కసారైనా గొంతు విప్పాడా? అంటూ వైఎస్ షర్మిల నిరంజన్ రెడ్డిని మరోమారు టార్గెట్ చేశారు.

బూతు పురాణంలో ఆరితేరిన కేసీఆర్.. నిరంజన్ రెడ్డి ఈ సవాల్ స్వీకరించు
మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తే.. అది మీకు తిట్టినట్లు అయిందా? అంటూ ప్రశ్నించినా షర్మిల అలా అనిపిస్తే బూతు పురాణంలో ఆరితేరిన కేసీఆర్ పై, మంత్రి నిరంజన్ రెడ్డిపై, మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆ తర్వాతే రాజన్న బిడ్డను ముట్టుకోవాలన్నారు. అంతేకాదు మంత్రి నిరంజన్ రెడ్డి పాలమూరు బిడ్డే అయితే,ఈ జిల్లా ప్రజల మీద ప్రేమే ఉంటే తాను చేసిన సవాల్ స్వీకరించాలి అన్నారు. నిజంగా నీళ్ల నిరంజన్ రెడ్డివే అయితే 'పాలమూరు-రంగారెడ్డి' ప్రాజెక్టు కోసం మేం చేస్తున్న 24గంటల నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొనాలని సవాల్ విసురుతున్నాం అంటూ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications