Leo movie: కాలినడకన తిరుమలకు

తిరుపతి: మచ్ అవైటెడ్ మూవీ.. లియో (Leo). దళపతి విజయ్ హీరో. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. దసరా (Dussehra 2023) పండగను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ భారీ యాక్షన్ ఫిల్మ్. 250 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

అర్జున్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, త్రిష, మడొన్నా సెబాస్టియన్.. కీలక పాత్రల్లో నటించారు. ఇదివరకు విజయ్ నటించిన వారిసు మూవీ నిరాశపరిచింది. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీనితో లియోపై ఆశలు పెట్టుకున్నారు దళపతి ఫ్యాన్స్. వారి అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ అదరగొట్టాయి.

Director Lokesh Kanagaraj and the team of Leo movie arrived Tirumala

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కమల్ హాసన్ విక్రమ్ ఏ స్థాయిలో సూపర్ హిట్ అయిందో తెలిసిందే. దాన్ని మించి పోయేలా లియో ఉండొచ్చనేది కోలీవుడ్ టాక్. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది. త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను చెన్నై, హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది యూనిట్.

ఈ సినిమా విడుదల కాబోతోండటంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్, సినిమా యూనిట్ సభ్యులు తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున వారు తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన వారంతా తిరుమలకు వచ్చారు. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 12 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది. బుధవారం 72,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 27,388 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా టీటీడీకి 3.74 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+