తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? కీలక అప్డేట్ మీ కోసమే!
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లాలనుకునేవారు తిరుమలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తిరుమలలో రద్దీ ఏ విధంగా ఉంది? దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? తిరుమలలో ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉంది? వంటి అనేక వివరాలను తెలుసుకొని తదనగుణంగా ప్లాన్ చేసుకొని వెళతారు.
జల కళను సంతరించుకున్న తిరుమల గిరులు
అయితే ప్రస్తుతం తిరుమల లో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని టిటిడి తాజాగా వెల్లడించింది. కలియుగ వైకుంఠ దైవమైన దేవదేవుడు కొలువైన తిరుమల క్షేత్రం ప్రస్తుతం జల కళతో తొణికిసలాడుతుంది.

పాప వినాశనం, గోగర్భం జలాశయాల గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల
తిరుమలలో ప్రస్తుతం పాప వినాశనం, గోగర్భం, కుమారధార, ఆకాశగంగా, పసుపు ధార జలాశయాలు పూర్తిగా జలకళను సంతరించుకున్నాయి. దీంతో అధికారులు పాప వినాశనం, గోగర్భం జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆకాశగంగా, కుమారధార, పసుపు ధార జలాశయాలు కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పొంగి ప్రవహిస్తున్నాయి.
పూర్తి స్థాయి నీటి మట్టంతో పాప వినాశనం డ్యామ్
ప్రస్తుతం ఈ జలాశయాలలో ఉన్న నీటి నిల్వలు తిరుమలలో 355 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుమల లో పాప వినాశనం డ్యామ్ నీటి సామర్థ్యం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయానికి పాప వినాశనం డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 5240.00 లక్షల గ్యాలన్ లు కాగా, 5192.00 లక్షల గ్యాలన్లుగా ఉంది.
గోగర్భం, కుమారా ధార డ్యామ్ లలో నీటి సామర్ధ్యం ఇలా
అంతే కాదు గోగర్భం డ్యామ్ నీటి సామర్థ్యం 2833.00 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 2, 833.00 లక్షల గ్యాలన్లు గా పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. మరోవైపు కుమారధార డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 4258.9 8 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 4229.42 లక్షల గ్యాలన్లుగా ఉంది.
నిండు కుండలా ఆకాశ గంగ, పసుపు ధార జలాశయాలు
ఇక ఆకాశగంగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 685.00 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 685.00 గా ఉంది అంటే పూర్తిస్థాయి నీటిమట్టంతో ఆకాశగంగా డ్యాం ఉంది. ఇక పసుపు ధార డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 1287.51 లక్షల గ్యాలన్ లు కాగా, ప్రస్తుత నిల్వ 1267. 48 లక్షల గ్యాలన్లుగా ఉంది.
తిరుమలలో రమణీయంగా ప్రకృతి
ప్రస్తుతం ఇటీవల కురిసిన వర్షాలతో తిరుమలలో జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పచ్చని ప్రకృతి, అందమైన శేషాచల కొండల మధ్య అందంగా జాలువారుతున్న జలపాతాలు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications