ISRO.. మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్-సీ55 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని లాంచ్ ప్యాడ్-1 నుంచి ఈ మధ్యాహ్నం 2:19 నిమిషాలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిందీ రాకెట్.
రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లిందీ రాకెట్. ఈ రెండూ సింగపూర్‌కు చెందినవే. 741 కేజీల బరువు గల టెలియోస్-2, 16 కేజీల బరువు ఉండే లూమ్ లైట్-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. దీన్ని ప్రయోగించడానికి శుక్రవారం మధ్నాహ్నమే కౌంట్‌డౌన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. 25 గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది. ఈ ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 57వ ప్రయోగం.

పీఎస్‌ఎల్‌వీ సీ -55 ప్రయోగం సక్సెస్..!!#ISRO #PSLVC55 #SrihariKota #Oneindiatelugu pic.twitter.com/kZHlr7JjAR
— oneindiatelugu (@oneindiatelugu) April 22, 2023
ఇటీవలే- ఇస్రో జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్ వర్క్ శాటిలైట్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. వన్ వెబ్ ఇంటర్నెట్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో వన్ వెబ్ ఒకటి. మొత్తంగా 72 శాటిలైట్లను లో-ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడానికి ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

గ్లోబల్ బ్రాడ్ బ్యాండ్ కవరేజీని మరింత మెరుగుపర్చడానికి 588 ఉపగ్రహాల ప్రారంభించాలంటూ వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. దీనికోసం ఇస్రోతో అసోసియేట్ అయింది. తొలిదశలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. దశలవారీగా వాటిని కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.
#WATCH | "Congratulations| PSLV-C55/TeLEOS-2 Mission - the PSLV has placed both satellites in the intended orbit." says ISRO chief S Somanath
— ANI (@ANI) April 22, 2023
(Source: ISRO) pic.twitter.com/W1rUczvmt9












Click it and Unblock the Notifications