తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రంజన్ గొగొయ్
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తోపాటు ఆయన సతీమణిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారికి నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవలో ఆయన పాల్గోన్నారు. కాగా శనివారం తిరుమలలోనే బస చేయనున్న గొగొయ్ ఆదివారం ఉదయం కూడ మరోసారి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గోననున్నారు.
ఈ నెల 17 న పదవి విరమణ పొందనున్న చీఫ్ రంజన్ గొగొయ్ శనివారం సాయంత్రం తిరుమల తిరుపతికి చేరుకున్నారు. ఆయన చివరి పని దినాన్ని శుక్రవారమే ముగించుకున్న ఆయన శనివారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం గొగొయ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సంధర్భంగా అదనపు ఈవో ధర్మారెడ్డి గొగొయ్ దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్గించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గొగొయ్ దంపతులు పండితులు వేదాశ్వీరచనం ఇచ్చారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు.స్వామీ తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా ఆయన శనివారం తిరుమలలోనే బస చేసి ఆదివారం ఉదయం కూడ మరోసారీ శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు.
భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా గొగొయ్ తన చివరి పనిదినాన్ని జస్టిస్ రంజన్ గోగోయ్ శుక్రవారం ముగించుకున్నారు. అనంతరం ఆయన్ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ గొగోయ్ ఈ నెల 17 పదవీ విరమణ చేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గొగోయ్.. ఆ పదవిని చేపట్టిన తొలి ఈశాన్య భారతీయుడిగా రికార్డులకెక్కారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications