TTD: అంకురార్పణతో మొదలైన తిరుపతి మహా ఉత్సవం!

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వతేదీ వరకు వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించటం కోసం టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాలంకరణ లతో, చలువ పందిళ్ళతో ఆలయ ప్రాంగణం అంతా శోభాయమానంగా మారింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏ మాత్రం తగ్గకుండా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ. నేడు పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

TTD Tiruchanoor padmavathi temple brahmotsavam started in a grand manner with ankurarpana

ఉదయం లక్ష కుంకుమార్చన సేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేడు ఉదయం కూడా అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.ఈ కుంకుమార్చన సేవలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి నేడు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు.

లక్ష కుంకుమార్చనతో నిర్విఘ్నంగా బ్రహ్మోత్సవాలు
ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను స్తోత్రం చేస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు.
అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.

రేపు చిన్నశేష వాహనంపై అమ్మవారు
కాగా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కూడా జరగటంతో రేపటి నుండి అమ్మవారికి విశేష వాహన సేవలు జరగనున్నాయి. ఇక పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున 28వ తేదీన చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. బ్ర‌హ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆల‌య మాడ వీధుల్లో అమ్మవారికి వాహనసేవలు జరుగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+