TTD: కావాల్సనన్ని లడ్డూలు, దక్కాలంటే- ఆ దాతలకు బంగారు డాలర్..!!

Tirumala: టీటీడీ పలు కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే నూతన పాలక వర్గం కొత్త నిర్ణయాల పైన కసరత్తు చేస్తోంది. తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం తిరిగి అమలు చేస్తున్నారు. అదే విధంగా భక్తులకు ఇక కోరినన్న లడ్లు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆనందనిలయం స్వర్ణమయం తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ముందుకు వచ్చే దాతలకు ఇచ్చే సౌకర్యాల పైన టీటీడీ కీలక ప్రతిపాదనలతో సిద్దమైంది.

కోరినన్ని లడ్డూలు
ఇక నుంచి శ్రీవారి భక్తులకు కావాల్సినన్ని లడ్డూ లు ఇచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. భక్తులు కోరిన విధంగా లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. టీటీడీలో ప్రస్తుతం ప్రతీ రోజు మూడున్నార లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల వరకు పెద్ద లడ్డూలు (కళ్యాణం లడ్డూ), మూడున్నార వేలకు పైగా వడలు తయారు చేస్తోంది. పలు నగరాల్లోని స్థానిక ఆలయాల్లో నూ లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు కోరినన్ని లడ్డూలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సెలవులు, పర్విదినాలు, ప్రత్యేక రోజుల్లో లడ్డూలకు రెట్టింపు డిమాండ్ ఉంటుంది.

TTD to re introduce Anandanilayam swarnamayam scheme break darshan for Gold Donors

అదనపు సిబ్బంది
దీంతో, భక్తుల డిమాండ్ మేరకు లడ్డూలు అందుబాటులో ఉంచేందుకు ప్రసాదం తయారీ కోసం మరో 74 మంది శ్రీవైష్ణవులతో పాటుగా అదనపు సిబ్బందిని సిద్దం చేస్తున్నారు. పోటు సిబ్బంది ద్వారా అదనపు లడ్డూలను సిద్దం చేసి..భక్తులకు పంపిణీకి టీటీడీ సిద్దం అవుతోంది. అదే విధంగా
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీటీడీ సిద్దం అవుతోంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు.

స్వర్ణమయం పథకం దాతలకు
స్వర్ణమయం పథకం దాతలకు రూ.2,500/- టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిజేయాలని నిర్ణయిం చారు. దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ బహుమానంగా అందజేస్తారు. దాతలకు మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలరును, 50-గ్రాముల వెండి నాణెంను బహుమానంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఛైర్మన్ బీఆర్ నాయుడు తాజాగా తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+