Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ : దర్శనం -సేవా టికెట్లు నేడు విడుదల..!!

శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల తో పాటుగా వర్చువల్ సేవా టికెట్లను ఈ రోజు ఆన్ లైన్ లో జారీ చేయనుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను (ఈ రోజు) శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఈ రోజు మధ్యాహ్న 2 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం మార్చి నెలకు సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో జారీ చేయనుంది.

ఈ రోజు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మూడు రకాల టికెట్లను విడుదల చేయనుంది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.. అంగప్రదక్షిణం టోకెన్ల తో పాటుగా మార్చి నెల వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు..సంబంధిత దర్శన టికెట్లు కోటాను విడుదలకు నిర్ణయించింది. భక్తులు వరుసగా విడుదల చేస్తున్న ఈ టికెట్లను ఆన్ లైన్ విధానం ద్వారా పొందే అవకాశం కల్పించారు. దర్శనం..సేవలకు సంబంధించి టీటీడీ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెలకు సంబంధించి దర్శనం, సేవా టికెట్లను ఒకే రోజు విడుదల చేయటం ద్వారా భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

TTD to Release Special entry darshan and Srivari VArtual Seva tickets today by online

మరో వైపు మార్చి 1వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి భక్తులకు ముఖ గుర్తింపు అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో తిరుమలలో గతంలో అమలు చేసిన శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు రోజు 150 టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 1వ తేదీ నుంచి నిత్యం వెయ్యి టికెట్లు శ్రీవాణి కింద అందుబాటులో ఉంచుతారు. వాటిల్లో 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. తిరుమల గోకులం కార్యాలయంలో వీటిని ఆఫ్ లైన్ విధానంలో అందిస్తున్నారు. కావాల్సిన భక్తులు తమ ఆధార్ గుర్తింపు కార్డుతో నేరుగా టికెట్ పొందే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+