రూ.లక్షకు రూ.3 లక్షలిచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్
స్టాక్ మార్కెట్లలో మల్టీబ్యాగర్ స్టాక్స్ పెట్టుబడిదారుల పంట పండిస్తుంటాయి. అతి తక్కువ కాలంలోనే షేరు విలువను ఎన్నో రెట్లు పెంచి మంచి లాభాలను అందజేస్తున్నాయి. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ఒకటి పెట్టుబడిదారులకు సంవత్సరం వ్యవధిలోనే 195 శాతానికిపైగా రిటర్న్స్ అందించింది. ఆ స్టాక్ పేరు యూనివర్సల్ కేబుల్స్ లిమిటెడ్.
2022 మే 13న ఈ స్టాక్ ధర రూ.138.95 వద్ద ఉండగా.. 2023 మే 12 నాటికి ధర రూ.410.3కి సంవత్సరం వ్యవధిలోనే దాదాపు 195 శాతం పెరిగింది. దీంతో ఏడాది కిందట ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు లక్షల రూపాయల్లో లాభం వచ్చింది. ఇది S&P BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్టాక్. పెట్టుబడి పరంగా చూసుకుంటే ఏడాది కిందట ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే వారి సంపద ఇప్పుడు రూ.2.95 లక్షలకు చేరింది. రూ.1.95 లక్షలు లాభం.

2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ ఊహించని ఫలితాలు సాధించింది. కంపెనీ నికర లాభం 356 శాతానికిపైగా పెరిగి రూ.11.21 కోట్లుగా నమోదైంది. ఇక కంపెనీ నెట్ సేల్స్ 20 శాతానికిపైగా పుంజుకున్నాయి. వీటి విలువ రూ.590.99 కోట్లకు చేరింది. కంపెనీ ROE, ROCE కూడా వరుసగా 6.17 శాతం, 9.44 శాతంగా మంచి స్థాయిలో ఉన్నాయి. హై వోల్టేజ్ కెపాసిటర్స్, సర్జ్ ప్రొటెక్షన్ కెపాసిటర్స్, ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ (APFC) ప్యానెల్స్ ను యూనివర్సల్ కేబుల్స్ తయారుచేస్తుంటుంది. ఈ కంపెనీ షేరు ధర రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టాక్‌లో వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications