బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి భారీ ఆదాయం.. ఎన్ని కోట్లో తెలుసా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌కేత్రాల‌లో విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం ఒక‌టి. ఇక్క‌డ కొలువై ఉన్న‌వారు అమ్మ‌వారు భ‌క్తుల కోర్కెలు తీర్చే క‌ల్ప‌వ‌ల్లి. ద‌స‌రా సంద‌ర్భంగా ఇక్క‌డ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఎంతో వైభ‌వంగ నిర్వ‌హిస్తారు. ఇక‌, విజయవాడ సంద‌ర్శంచిన‌వారు త‌ప్ప‌కుండా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఇక్క‌డ నిత్యం భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా ఉంటుంది. ఇప్పుడు వేస‌వి సెల‌వులు కాబ‌ట్టి ర‌ద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన అమ్మ‌వారిని ద‌ర్శించుకుని భ‌క్తులు కానుక‌లు స‌మ‌ర్పించుకుంటారు. అయితే, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి భారీ ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. కేవ‌లం 16 రోజుల్లోనే దుర్గ‌మ్మ‌కు రూ.2,09,49,116 కానుకల రూపంలో వచ్చిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై వెల‌సిన అమ్మ‌వారిని కేవ‌లం 16 రోజుల్లోనే వేలాది మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ఇక‌, ఈ ఆలయ మహామండపంలోని ఆరో అంతస్తులో అమ్మ‌వారి హుండీల ద్వారా వ‌చ్చిన కానుకలను లెక్కించారు. ఈ కార్య‌క్ర‌మం ఈవో కేఎస్‌ రామారావు, అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో జ‌రిగింది. మొత్తం రూ.2.09కోట్లకు పైగా న‌గ‌దును భ‌క్తుల కానుక‌ల రూపంలో అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. న‌గ‌దుతో పాటు 434 గ్రాముల బంగారం, 4.145 కిలోల వెండి కానుకల రూపంలో వచ్చాయి. వీటితో పాటు విదేశీ క‌రెన్సీ కూడా ఉంది.

Bejawada Kanakadurgamma temple has a huge income Do you know how many crores

హుండీలలో యూఎస్ డాలర్లు 171, ఆస్ట్రేలియా డాలర్లు 115, అరబ్‌ ఎమిరేట్‌ దిర్హమ్స్‌ 105, సౌదీ రియాల్స్‌ 66, మలేషియా రింగెట్లు 50, కెనడా డాలర్లు 10, ఇంగ్లండ్‌ పౌండ్లు 5, కువైట్‌ దినార్‌ 1, బహరైన్‌ దినార్లు 3.5 ఉన్నాయి. వీటితోపాటు ఆన్‌లైన్‌ ఈ-హుండీ ద్వారా 45,01,0 కానుకలను కూడా భ‌క్తులు స‌మ‌ర్పించుకున్నారు. ఇక్క‌డ ప్రతిరోజు భ‌క్తుల కోసం అన్న‌విత‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉటుంది. అలాగే దుర్గమ్మ ఆలయంలో అన్నవితరణ కోసం గుంటూరుకు చెందిన ఆర్‌.కోటిసుధాకర్‌ కుటుంబసభ్యులు రూ.1,01,116లు విరాళం అందజేసిన‌ట్ల ఆల‌య అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+